twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా..రిస్క్ తీసుకుంటున్నట్లే, పిల్లలు చూస్తారని ప్రత్యేక జాగ్రత్తలు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమాకైనా టోటల్ రన్ టైమ్ అనేది చాలా కీలకమైన పార్ట్ ప్లే చేస్తోంది. అందుకే సాధ్యమైనంత తక్కువ రన్ టైమ్ తో అంటే రెండున్నర గంటల లోపే , ఇంకా సాధ్యమైతే రెండు గంటల పదినిముషాలకే కుదిస్తూ ధియోటర్లకు రావాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఎడిటింగ్ టేబుల్ మీదే కట్స్ పడిపోతున్నాయి. అలా కాకుండా వస్తే , కొద్దిగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా మరుసటి రోజు కోతలు పడుతున్నాయి.

    తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం సెన్సార్ పూర్తైంది. ఈ చిత్రం ఏప్రియల్ 8న విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రన్ టైమ్ గురించిన టాక్ బయిటకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండు గంటల 45 నిముషాల రన్ టైమ్ తో నడవనుంది. ఇప్పుడు ఉన్న పరిస్దితుల్లో ఇది ఎక్కువ రన్ టైమే అని చెప్పాలి.

    Sardaar's total runtime is 2 hours and 45 minutes

    అయితే పవన్ వంటి స్టార్ తెరపై కనపడుతూ, డాన్స్ లు పైట్స్, డైలాగులతో మరిపిస్తున్నప్పుడు అది అంత పెద్ద సమస్య అనిపించదనేది మాత్రం వాస్తవం. ఎంగేజ్ చేయగలిగితే ఎంత పెద్ద సినిమా అయినా చిటికలో అయిపోయిన్నట్లు ఉంటుంది. అదే సూత్రం నమ్మి పవన్ ఇంత లెంగ్త్ ఉంచాడా అనే సందేహాలు వస్తున్నాయి.

    పవన్‌, కాజల్‌ జంటగా నటించిన చిత్రమిది. శరత్‌మరార్‌ నిర్మాత. బాబి దర్శకత్వం వహించారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. గురువారం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

    Sardaar's total runtime is 2 hours and 45 minutes

    ఈ సందర్భంగా నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ ది కీలక స్థానం. పవన్‌ ఇంట్రడక్షన్ సీన్స్ లో భాగంగా వచ్చే ఫైట్‌ ఆకట్టుకొంటుంది. ఇంటర్వెల్ ముందొచ్చే ఫైట్ నీ ప్రత్యేకంగా రూపొందించారు. 'మన సినిమాలో రక్త పాతం వద్దు' అని పవన్‌ ముందే చెప్పారు.

    ఎందుకంటే పవన్‌ చిత్రాలంటే మహిళలు, పిల్లలు ఎక్కువగా చూస్తారు. పోరాట సన్నివేశాలు వాళ్లకు నచ్చేలా ఉండాలన్నది పవన్‌ ఉద్దేశం. రామ్‌ లక్ష్మణ్‌లు ఆయా సన్నివేశాల్ని అలానే రూపొందించారు.

    సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకొంటూ యాక్షన్‌ ఘట్టాల్ని చిత్రీకరించాం. ఫ్లై కెమెరాలు, పేంథమ్‌ డాలీ కెమెరాలతో ఆయా సన్నివేశాల్ని తెరకెక్కించాం. దాంతో ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతి కలగనుంది'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

    English summary
    As per censor report, Sardaar's total runtime is 2 hours and 45 minutes. The makers of Sardaar are indeed taking a huge risk as such long duration .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X