twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సత్య -2' మరీ అంత దారుణ కలెక్షన్స్??

    By Srikanya
    |

    హైదరాబాద్ :సమాజంలో క్రైం అనేది ఎప్పటికీ చావదు...దాని రూపం మార్చుకుంటుంది, రాయల సీమ ఫ్యాక్షనిస్టులు, బెడవాడ రౌడీలు, హైదరాబాద్ గుండాల కాలం పోయింది. కొత్తరకం క్రైం చూపెట్టాం అని ప్రచారం చేస్తూ వర్మ తాజా చిత్రం సత్య 2 వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రీమియర్ షో ల నుంచే నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అక్కడక్కడ కొన్ని పాజిటివ్ రివ్యూలు వచ్చినా సినిమాని కాపాడలేకపోయాయి. బాలీవుడ్ ట్రేడ్ లో చెప్పేదాన్ని బట్టి... వీకెండ్ లో కేవలం కోటిన్నర మాత్రమే ఈ చిత్రం వసూలు చేసింది. ఈ సినిమా ప్లేస్ లో హృతిక్ రోషన్ చిత్రం క్రిష్ 3 చిత్రం..ని చాలా చోట్ల ప్రైమ్ టైమ్ లో వేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హిందీలో వెర్షన్లో ముంబై అండర్ వరల్డ్ నేపథ్యాన్ని తీసుకున్నారు. పునీత్ సింగ్ రత్న్ సత్య పాత్రలో నటించాడు. తెలుగు వెర్షన్లో హైదరాబాద్ నేపథ్యం తీసుకున్నారు. శర్వానంద్ సత్య పాత్రలో నటించాడు.

    ఇక మరో ప్రక్క సెన్సార్‌ బోర్డు ప్రాంతీయాధికారి ధనలక్ష్మిపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తరఫున ఆయన ప్రతినిధి సుధీర్‌ చంద్ర నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దర్యాప్తు నిమిత్తం పోలీసులను ఆదేశించాలని, అమెను అరెస్ట్‌ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. సత్య 2 సినిమాను ముంబయిలో కేవలం రెండు చోట్ల కట్‌ చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేయగా ఇక్కడ ప్రాంతీయ కార్యాలయంలో ధనలక్ష్మి 40 చోట్ల కట్‌ చేయాలని ఆదేశించారని ఆయన ఆరోపించారు. 12వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఈ ఫిర్యాదును విచారించే అవకాశం ఉంది.

    కథ విషయానికొస్తే...సత్య(శర్వానంద్) అండర్ వరల్డ్‌కు రారాజు కావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వస్తాడు. తనదైన ఆలోచన విధానంతో ముందుకు సాగుతుంటాడు. తక్కువ టైంలోనే సత్య తన టాలెంట్ తో ఓ కంపెనీని మొదలు పెడతాడు. ఈ కంపెనీ పేరుతో కొంతమంది ప్రముఖులను చంపుతూ ఉంటారు. ప్రజలను భయ పెట్టి వేల కోట్లు సంపాదించాలనే టార్గెట్ పెట్టుకుంటాడు. కంపెనీ ఈ మాఫియ దేశం మొత్తం వ్యాపిస్తుంది. అదే సమయంలో కంపెనీ వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోడానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ని నియమిస్తుంది. ఈ క్రమంలో సినిమా అనుకోని మలుపు తిరుగుతుంది. మరి సత్య అలా ఎందుకు మారాడు? సత్య కథ ఎలా ముగిసింది అనేది తెరపై చూడాల్సిందే.

    English summary
    Ram Gopal Varma's ‘Satya 2’ which released amidst huge expectations got negative reviews right from the premier show. Very few gave good reviews and ‘Satya 2’ slumped in Bollywood with theater owners preferring to have Hrithik Roshan's ‘Krish 3’ screened at prime time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X