twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంత రేటు పెట్టి కొన్నారా..నమ్మచ్చా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : డబ్బింగ్ సినిమా రైట్స్ 30 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మబుద్ది అవుతుందా...అయితే నమ్మాల్సిందే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ఐ చిత్రం తెలుగు డబ్బింగ్ మనోహరుడు రైట్స్ ని ముప్పై కోట్లుకు అమ్మినట్లు చెప్తున్నారు. ఆ రైట్స్ ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు తీసుకున్నారు. అయితే లక్ష్మీ గణపతి ఫిలింస్ వారు వీటి కోసం ట్రై చేస్తున్నట్లు వినిపించింది. అయితే వారు 15 కోట్ల వరకూ అడిగినట్లు సమాచారం.

    ఇంతకు ముందు ఎక్కువ రేటు పెట్టి కొన్న రజనీ విక్రమ్ సింహా చిత్రం భాక్సాఫిస్ వద్ద డిజాస్టర్ అయిన నేపధ్యంలో ఈ చిత్రంకు అంత రేటు వస్తుందని నమ్మలేకపోతున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 22 న విడుదల అయ్యే ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ తెలుగు నాట కూడా సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు.

    ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా.. భారీస్థాయిలో విడుదలవుతోంది. దీంతో అంతకన్నా ముందే దీపావళి రేసులో ఉన్న 'కత్తి', 'పూజై' చిత్రాలు వాయిదా పడినట్లు కోలీవుడ్‌ టాక్‌. అయితే తాము తప్పకుండా వస్తామని.. 'ఐ'కి గట్టి పోటీ ఇస్తామని ఈ చిత్రాలు చెబుతున్నాయి. దాంతో ఈ చిత్రాల నుంచి కూడా పోటీ ఉండటం కూడా మనోహరుడుకి మైనస్ గా మారింది.

    Shankar gets the Biggest Price once again for Manoharudu

    ఇటీవల జరిగిన 'పూజై' చిత్ర మీడియా...సమావేశం విశాల్‌ మాట్లాడుతూ.. హరి దర్శకత్వంలోని 'పూజై' సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను సొంత బ్యానరుపై నిర్మించా. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళికి తప్పకుండా విడుదల చేస్తానని చెప్పారు. తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులోనూ విడుదలకు సిద్ధమైందని విశాల్‌ అన్నారు.

    మరో ప్రక్క దర్శకుడు శంకర్‌తో పోటీ పడేందుకు ఏఆర్‌ మురుగదాస్‌ 'కత్తి'ని సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాను కూడా ఎట్టిపరిస్థితుల్లో దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్లో వచ్చిన 'తుప్పాక్కి' భారీ హిట్‌ను సొంతం చేసుకోవడంతో మళ్లీ అదే సెంటిమెంట్‌ను నమ్ముతున్నారు మురుగదాస్‌. దీంతో ఈ దీపావళి ఏకంగా రూ.300 కోట్ల పైచిలుకు వినోదాన్ని అందించేందుకు కోలీవుడ్‌ సిద్ధమవుతోంది.

    English summary
    Director Shankar`s next, it seems has fetched another record price for Dubbed films!. The Telugu Dub, Manoharudu has been sold for 30Cr to Mega Super Good Films if reports in Trade are to be believed!.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X