twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీగల్ సమస్య లో శంకర్ “ఐ” ఓవర్ సీస్ రైట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : విక్రమ్, శంకర్ ల తాజా చిత్రం "ఐ" అడుగడుగునా ఏదో ఒక ఆటంకం ఎదురౌతోంది. ఓ ప్రక్కన చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని నిర్మాత ప్లాన్ చేసి, బిజినెస్ చేస్తూంటే రకరకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ విషయంలో వివాదం నెలకొందని సమాచారం. ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ తమకే ఇచ్చారని రాకేష్ రోషన్ అల్లుడు...హైపర్ బీస్ గ్రూప్ హెడ్ వాదిస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    వివరాల్లోకి వెళితే... ఆస్కార్ ఫిల్మ్స్ సంస్ధ నుంచి ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని B4U, హైపర్ బీస్ గ్రూప్ కొనుగోలు చేసి ఐదు కోట్లు అడ్వాన్స్ పేమెంట్ చేసింది. మిగిలిన పేమెంట్ 5 కోట్లు డిసెంబర్ 12 కి చెందేలా వారు దాన్ని అమెరికా నుంచి వైర్ చేసారు. అయితే ముంబై లోని బ్యాంక్ లో అది స్టక్ అవటంతో అది తమకు అందలేదు కాబట్టి ఎగ్రిమెంట్ కాన్సిల్ చేసేసింది ఆస్కార్ ఫిల్మ్స్ సంస్ధ.

    Shankar's 'I' Overseas Rights in legal trouble

    అంతేకాకుండా తామే డైరక్ట్ గా రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని తమిళ వెబ్ సైట్స్ లో ప్రకటనలు సైతం ఇచ్చేసింది. ఈ లోగా ఆ వైర్ ఏమౌంట్ వచ్చింది. ఇదంతా గమనించిన B4U వారు లీగల్ గా కోర్టుకు వెళ్తామని అంటున్నారు. మరో ప్రక్క అసలు ఈ రైట్స్ ఎవరు దగ్గర ఉన్నాయో తెలియక ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా కన్ఫూజ్ లో ఉన్నారు.

    'ఐ' చిత్రం విషయానికి వస్తే..

    విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఐ (తెలుగులో మనోహరుడు) చిత్రం ప్రారంభం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోన్న సంగతి తెలసిందే. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం చెన్నైలో విడుదల చేసిన ఈ సినిమా ఆడియో మంచి విజయం సాధించి సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది.

    విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రూ.150 కోట్ల పైచిలుకు వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. విదేశీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేస్తారు. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు.

    'ఐ'లో విక్రమ్‌ సరసన అమీ జాక్సన్‌ నటించింది. శంకర్‌ దర్శకత్వం వహించారు. ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌ కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకుడు. ఇటీవలే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో విక్రమ్‌ ధరించిన వేషాలు చూసి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు.

    వెండితెరపై సాంకేతిక మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంటారు దర్శకుడు శంకర్‌. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ముగ్ధుడిని చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చిత్రాల్ని తీర్చిదిద్దుతుంటారు. విక్రమ్‌తో తీస్తున్న 'ఐ' కోసం పలు విదేశీ కంపెనీలతో కలసి పని చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు'' అన్నారు.

    విక్రమ్‌ మాట్లాడుతూ ''శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.

    శంకర్, విక్రమ్ సినిమాలకి తమిళం తర్వాత మళ్లీ అదేస్థాయిలో ఫ్యాన్ బేస్, మార్కెట్ వున్న ఏరియా తెలుగు పరిశ్రమ. అందుకే తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడం కోసం ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ బయిటకు వచ్చి తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో , తమిళ మీడియాలో నలుగుతోంది.

    కథేమిటంటే...

    ప్రముఖ ప్రపంచ కండల వీరుడు, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్‌ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు. తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనే అంశం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఐ'.

    English summary
    Vikram and Shankar’s “I” overseas rights got into legal trouble.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X