twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి బడ్జెట్, లాభాల లెక్కలపై..... నిర్మాత చెప్పిన షాకింగ్ వాస్తవాలు!

    ముంబైలో జరిగిన హిందీ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంటులో చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సినిమా బడ్జెట్, మొదటి భాగం రిలీజ్ తర్వాత తమకు ఎంత లాభాలు వచ్చాయనే విషయాలు వెల్లడించారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు... ఓవరాల్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ మొదటి భాగం 2015లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ 2017 లో రెండో భాగం విడుదల కాబోతోంది.

    సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలను హైదరాబాద్, ముంబైలలో గురువారం నిర్వహించారు. ముంబైలో జరిగిన హిందీ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంటులో చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సినిమా బడ్జెట్, మొదటి భాగం రిలీజ్ తర్వాత తమకు ఎంత లాభాలు వచ్చాయనే విషయాలు వెల్లడించారు.

    ఓవరాల్ బడ్జెట్

    ఓవరాల్ బడ్జెట్

    బాహుబలి రెండు పార్టులు పూర్తి చేయడానికి ఓవరాల్‌గా రూ. 450 కోట్లు ఖర్చు చేసినట్లు శోభుయార్లగడ్డ వెల్లడించారు. శోభు చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఇండియాలో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.

    బాహుబలి ఫస్ట్ పార్టు రిలీజ్ ద్వారా ఎంత లాభం?

    బాహుబలి ఫస్ట్ పార్టు రిలీజ్ ద్వారా ఎంత లాభం?

    బాహుబలి ఫస్ట్ పార్ట్ అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇంత వసూళ్లు సాధించినప్పటికీ నిర్మాతలైన తమకు పెద్దగా లాభాలేమీ రాలేదని, తమకంటూ ఏమైనా మిగిలితే రెండో పార్టు ద్వారానే మిగలాలి అని శోభుయార్లగడ్డ తెలిపారు.

    మరి లాభ పడింది ఎవరు?

    మరి లాభ పడింది ఎవరు?

    శోభు చెప్పిన విషయాలు బట్టి సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే ఎక్కువ లాభాలు చేసినట్లు స్పష్టమవుతోంది. అప్పట్లో సినిమాను కొనుగోలు చేసిన వారికి భారీగా లాభాలు వచ్చాయి.

    అదే లాభాలను దెబ్బకొట్టిందా?

    అదే లాభాలను దెబ్బకొట్టిందా?

    బాహుబలి నిర్మాతలకు ఫస్ట్ పార్టులో లాభాలు మిగలక పోవడానికి కారణం సినిమాను విదేశీ భాషల్లో రిజలీ చేయడమే అని తెలుస్తోంది. చైనా, యూరఫ్ లోని పలు దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

    ఈసారి 1000 కోట్లు ఖాయం

    ఈసారి 1000 కోట్లు ఖాయం

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి పార్ట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా జరిగినట్లు స్పష్టమవుతోంది. సినిమా రిలీజ్ తర్వాత థియేటర్ రన్ ద్వారా రూ. 1000 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    లీక్: కారకులు ఎవరంటూ రాజమౌళి ఎంక్వయిరీ, హడావుడిగా ప్రెస్ మీట్!

    లీక్: కారకులు ఎవరంటూ రాజమౌళి ఎంక్వయిరీ, హడావుడిగా ప్రెస్ మీట్!

    అనుకున్న సమయానికంటే కొన్ని గంట లీకైన విషయాన్ని రాజమౌళి కూడా ఒప్పుకున్నారు. ఈ పరిణామాలతో షాకైన బాహుబలి మూవీ టీం హడావుడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి..... ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా ఎందుకు జరిగింది? సాయంత్రం రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ ఉదయమే ఎలా లీక్ అయింది? అంటే.... రాజమౌళి వద్దగానీ, మూవీ టెక్నికల్ టీం వద్దగానీ సరైన సమాధానం లేదు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    During the 'Baahubali 2' trailer launch event in Mumbai, film's producer Shobu Yarlagadda revealed that they have spent around Rs 450 Cr to make both parts of 'Baahubali'. He said that they didn't make any money on the first part, which grossed Rs 600 Cr worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X