twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుసా? :తెలుగులో ఈ రోజు తొమ్మిది రిలీజ్ లు..లిస్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్ :సంక్రాంతి సినిమాల పండుగ సీజన్ వెళ్లిపోయింది. ఇప్పుడు ఇంకో సీజన్ మొదలైంది. అది చిన్న సినిమాలు సీజన్. సంక్రాంతికి అన్నీ పెద్ద సినిమాలు రిలీజైతే...ఇప్పుడు అన్నీ చిన్న సినిమాలు ఒకే సారి థియోటర్స్ పై దాడి చేస్తున్నాయి. ఎనిమిది నుంచి తొమ్మిది దాకా మీడియం బడ్జెట్ సినిమాలు ఈ వారం విడుదల అవుతున్నాయి.

    ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోని ఎక్కువ ధియోటర్స్ లో కృష్ణాష్టమి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రాలు ఆక్రమించి ఉన్నాయి. రెండూ పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు కావటంతో మాగ్జిమం ధియోటర్స్ లో అవే ఉన్నాయి. అదే సమయంలో హిట్ టాక్ తెచ్చుకున్న మలుపు చిత్రం కూడా బాగానే ఆడుతోంది.

    అసలు జనవరి 1కు రావాల్సిన డబ్బింగ్‌ 'మలుపు' సినిమా థియేటర్ల కొరతతో ఈనెల 19న విడుదలయింది. ఎప్పటినుంచో పెండింగ్‌లో వున్న దిల్‌రాజు సినిమా.. 'కృష్ణాస్టమి'కూడా విడుదలయింది. ఇలా వరుసపెట్టి సినిమా విడుదలకావడం వున్న థియేటర్లను సర్దుకుపోవడం చిన్న సినిమాల వంతయింది.

    వాస్తవానికి ఒకప్పుడు థియేటర్ల కొరత విపరీతంగా వుండేది. దాంతో కొందరు పెద్ద నిర్మాతలు థియేటర్లను కబ్జాచేస్తున్నారని అన్నారు. కానీ అలాంటివారిలో తాను లేనని దిల్‌రాజు వివరణ ఇచ్చారు. అలా వుంటే.. కృష్ణాష్ణమిని.. నేను సంక్రాంతికే విడుదలచేసేవాడ్నికదా! అని ఎదురు ప్రశ్నించారు.

    ఏదిఏమైనా.. ఈ ఏడాది చిన్న సినిమాలకు థియేటర్ల దొరకడం అనుకూలంగా మారిందని ఫిలింఛాంబర్‌ తెలియజేస్తుంది. కాగా, ఈ శుక్రవారం సినిమాలు వరసగా క్యూ కట్టాయి. దాదాపు 14 సినిమాలు లైన్‌లో వున్నాయి. అందులో ఏడు స్ట్రెయిట్‌ చిత్రాలు, రెండు ఆంగ్ల చిత్రాలు, నాలుగు హిందీ చిత్రాలు, ఒక తమిళ చిత్రం విడుదలకావడం విశేషం.

    స్లైడ్ షోలో ఈ వారం సినిమాలు లిస్ట్ చూద్దాం...

    ఎలుకా మజాకా

    ఎలుకా మజాకా

    'నమ్మినబంటు'లో ఎద్దు హీరో, 'నాగిని'లో పాము, 'ఈగ'లో ఈగ, ఎలుకా మజాకాలో ఎలుక హీరో. ఇందులో 40 నిముషాల గ్రాఫిక్స్‌ అద్భుతంగా వచ్చింది.. అని చెప్పారు. నిర్మాత మారెళ్ళ నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మాతలు.

    'క్షణం'

    'క్షణం'

    పీవీపీ బేన ర్‌లో అడవిశేష్‌, ఆదాశర్మ హీరోహీరోయిన్లుగా, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్షణం'. రవికాంత్‌ దర్శకు డుగా పరిచయమవుతున్నాడు. క్షణంపాటు జీవితంలో ఏదైనా జరగవచ్చు. ఆ నేపథ్యంలో జరిగిన ఓ యదార్థగాధ ఆధారంగా తీసుకుని తెరకెక్కించినట్లు వెల్లడిస్తున్నాడు. ఓ పాప రోడ్డున నిలబడి లిఫ్ట్‌ ఇవ్వమని.. ఓ కారును ఆపి అడిగే నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఇది చాలా ఇంట్రెస్ట్‌గా వుంటుందనీ, వైజాగ్‌లో జరిగిన సంఘటనకు కథగా మార్చుకున్నట్లు చెబుతున్నాడు.

    పడేసావె

    పడేసావె

    ఇక అన్న పూర్ణ బేనర్‌లో పలు చిత్రాలకు పనిచేసిన చునియా.. దర్శకురాలిగా మారి చేసిన సినిమా 'పడేసావె'. కార్తిక్‌ రాజు, నిత్య శెట్టి, సామ్‌ ప్రధాన పాత్రల్లో అయాన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై చునియా దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రమిది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు ఇది ముక్కోణపు ప్రేమకథ. ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ. ఇప్పటి యువత మనోభావాలకు అద్దం పడుతుందని దర్శకురాలు తెలియజేస్తుంది.

    వీరివీరి గుమ్మడి పండు.. వీరు పేరేమిటి?

    వీరివీరి గుమ్మడి పండు.. వీరు పేరేమిటి?

    ఉమ్మడి కుటుంబంలో హాయిగా వుంటున్న వాతావరణం ఒక్క సారిగా మాయమవుతుంది. ఎవరు ఎవర్ని నమ్మాల్లో తెలియక అందరి లోనూ గందరగోళం, భయం ఆవహి స్తుంది. దీనికి కారణం.. వారిలో ఓ దెయ్యం ఆవహించడమే... వీరివీరి గుమ్మడి పండు.. వీరు పేరేమిటి? అంటూ.. చిన్నతనంలో ఆడుకునే ఆటలాగా... వారి అందరితో దెయ్యం ఎవరిలో వుందనేది.. హారర్‌, ఎంటర్‌టైన్‌ మెంట్‌గా తీసిన చిత్రమే 'వీరివీరి గుమ్మడి పండు'.

    టెర్రర్‌

    టెర్రర్‌

    ప్రజలకు రక్ష కుడిగా వ్యవహరించే ఓ పోలీసు ఆఫీసర్‌ కథతో 'టెర్రర్‌' సినిమా రూపొందింది. శ్రీకాంత్‌ ప్రధాన పాత్ర పో షించిన ఈ చిత్ర కథాంశంకూడా బర్నింగ్‌ ప్రాబ్లమే. షేక్‌ మస్తా న్‌ నిర్మించిన ఈ చిత్రానికి సతీష్‌ కాసెట్టి దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్‌ గత చిత్రాలమాదిరి గానే వుంటుందా? కొత్త దనంగా వుంటుం దా. అనేది రేపు తెలియనుంది.

    'యమపాశం'

    'యమపాశం'

    హాలీవుడ్‌లో నడిచే శవాలపై సినిమాలు వస్తుంటాయి. ఆ స్పూర్తితో తమిళంలో ఓ సినిమా చేసి తెలుగులో వదులు తున్నారు. ఒక వైరస్‌ ప్రపంచమంతా వ్యాపించి, మనుషుల్ని నరమాంస భక్షకులుగా మార్చేస్తే, ఆ వైరస్‌ నుంచి మిగిలిన వాళ్లను కాపాడటమెలా అనేదే చిత్ర కథాంశం. ఇప్పటివరకూ రాని జాంబీ (నడుస్తున్న శవాలు) కాన్సెప్ట్‌తో తెర కెక్కిన 'మిరుతన్‌' సినిమాను తెలుగులో 'యమపాశం'గా విడు దల చేస్తున్నారు. జయం రవి, లక్ష్మీ మీనన్‌ జంటగా చేసిన ఈ చిత్రాన్ని శక్తి రాజన్‌ తెరకెక్కించారు.

    గాడ్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌

    గాడ్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌

    ఇదో డబ్బింగ్ సినిమా. తెలుగులో 'గాడ్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌'తో రాబోతుంది. దాదాపు 1400 కోట్ల బడ్జెట్‌తో భారీ కాస్టింగ్‌, సెట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాను కె.ఎఫ్‌.సి ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంస్థ విడుదల చెస్తోంది. భారీ ప్రళయం నుంచి ఈజిప్ట్‌ నగ రాన్ని, ప్రపంచాన్ని గాడ్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌గా ఆరాధించబడే హోరస్‌ ఏలా కాపాడాడు! అనే ఆసక్తి కర కధాంశంతో టెక్నికల్‌ వండర్‌గా తీసిన ఈ చిత్రమిది.

     'అప్పుడల్లా ఇప్పుడిలా'

    'అప్పుడల్లా ఇప్పుడిలా'

    ప్రేమతోపాటు కెరీర్‌ను చూసుకోవాలని తల్లిదండ్రులు చెబితే.. అందుకోసమే ప్రేమిస్తున్నానని కొడుకు అంటాడు. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. సూర్యతేజ, హర్షికా పూనాచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్‌ సమర్పణలో జంపా క్రియేషన్స్‌ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం 'అప్పుడల్లా ఇప్పు డిలా'. కె.ఆర్‌. విష్ణు దర్శకుడు.

    ‘రాజుగారింట్లో ఏడవ రోజు'

    ‘రాజుగారింట్లో ఏడవ రోజు'

    అజయ్, భరత్, అర్జున్, వెంకటేశ్, సుస్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్‌రాజ్ దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం నిర్మించిన చిత్రం ‘రాజుగారింట్లో ఏడవ రోజు'. దర్శకుడు ఫిరోజ్‌రాజా మాట్లాడుతూ, నలుగురు ఖైదీలు దెయ్యమున్న ఇంట్లో వుంటే ఏవౌతుందనే ఆసక్తికర అంశంతో కథను తెరకెక్కించామన్నారు.

    అమ్మాయిగోల శ్రీకృష్ణలీల

    అమ్మాయిగోల శ్రీకృష్ణలీల

    ఆక్యుప్రెషర్ ఆధారంగా నడిచే లవ్ స్టోరీ అంటూ ఈ చిత్రం వస్తోంది. ఈ చిత్రం కాన్సెప్టుతో ఇదే తొలి చిత్రం అంటున్నారు.

    రోజుకు ఐదు ఆటలు వేయమని చెప్పా : దాసరి

    రోజుకు ఐదు ఆటలు వేయమని చెప్పా : దాసరి

    ఈవారంలో 14 సినిమాలు విడుదలవుతున్నాయి. థియేట ర్లు దొరకని పరిస్థితి. అలాంటి స్థితిలో 'ఎలుక మజాకా' విడుదల వుతుంది. నాలుగు ఆటలున్న సినిమాను ఐదు ఆటలు వేయమని ప్రభుత్వంతో చర్చలు జరిపాను. ఒంటిగంట షోకు చిన్న సినిమాలు కేటాయిం చాలని.. దానికి టాక్స్‌ మినహాయించి, షో మ్యాండేటరీ చేయమన్నాను. త్వరలో చర్యలు చేపడతామని ప్రభుత్వం చెప్పింది..'' అని దాసరి నారాయణ రావు అన్నారు.

    ఇప్పటికీ...

    ఇప్పటికీ...

    సంక్రాంతి సినిమాల్లో సోగ్గాడే చిన్ని నాయినా, నాన్నకు ప్రేమతో చిత్రాలు ఇప్పటికీ కొన్ని చోట్ల ఆడుతున్నాయి. వీటి మధ్యలోకి ఈ వారం తొమ్మిది చిన్న సినిమాలు దూసుకు వస్తున్నాయి.

    English summary
    This Friday also a bunch of 9 movies are releasing to test their luck at the box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X