twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శ్రీమంతుడు’ : నైజాం ఏరియా రైట్స్ ..ఎవరికి ...ఎంతకి

    By Srikanya
    |

    హైదరాబాద్: కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీమంతుడు' చిత్రం ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9 మహేష్ పుట్టిన రోజు కానుకగా రెండు రోజుల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం బిజినెస్ ఊపందుకుంది. మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ తో నిర్మాతలు టేబుల్ ఫ్రాఫెట్ కే చిత్రాన్ని అమ్ముతున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రానికి నైజాం లో అద్బుతమైన రేటు పలికిందని తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    వివరాల్లోకి వెళితే...అభిషేక్ పిక్చర్స్ వారు..నైజాం ఏరియాను 14.4 కోట్లకు NRA బేసిస్ లో తీసుకున్నారు. వారు మాట్లాడుతూ..."మేం నైజాం ఏరియా...శ్రీమంతుడు చిత్రాన్ని రైట్స్ పొందటం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అవుతుందని ఖచ్చితంగా. ఈ సందర్భంగా...నిర్మాతలకు, దర్శకుడు కొరటాల శివకు, మహేష్ బాబుకు ధాంక్స్.. ," అన్నారు.

    Srimanthudu Nizam Rights sold for Superb Price

    మైత్రి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో జులై 18న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఈనెల 27తో ముగియనుందని చిత్ర నిర్మాత తెలిపారు. అలాగే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఓ ఛానెల్ భారీ రేటుకు దక్కించుకుందని సమాచారం.

    ఇంకా ఆడియో కూడా రిలీజ్ కాని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో గట్టి పోటీ నెలకొందట. ఫైనల్‌గా ‘శ్రీమంతుడు' శాటిలైట్ రైట్స్‌ని సుమారు 10 కోట్ల రూపాయలకి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

    ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

    Srimanthudu Nizam Rights sold for Superb Price

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ మంతుడుకి సంబందించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాలోని నటీ నటుల డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వారిది ముగియగానే మహేష్ బాబు తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేస్తారు.

    మరో ప్రక్క ఈ చిత్రంలో మహేష్ వాడే సైకిల్ ఖరీదు ఎంత ఉండవచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ సైకిల్ ఖరీదు... మూడున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ సైకిల్... Canondale కంపెనీవారి Scalpel 29 మోడల్ లో త్రీ ఫ్రేమ్ కార్బన్ అని తెలుస్తోంది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఈ సైకిల్ ఖరీదు... అక్కడ 5500$ అంటున్నారు. మహేష్ ఓ మిలియనీర్ అని ఈ సైకిల్ తో దర్శకుడు చెప్పాడంటున్నారు.

    ఇక ఈ చిత్రంతో మహేష్‌బాబు నిర్మాతగా మారారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' సినిమాతోనే మహేష్‌ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

    Srimanthudu Nizam Rights sold for Superb Price

    'శ్రీమంతుడు' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

    మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

    English summary
    Abhishek Pictures which is run by an NRI bagged the Nizam rights of 'Srimanthudu' for Rs 14.4 crore on NRA basis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X