twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి2 బంగారు గని అట.. నిర్మాతల పాలిట కల్పవృక్షం.. దిమ్మతిరిగేలా బిజినెస్..

    By Rajababu
    |

    ఎన్నో సంచలన అంశాలకు వేదిక అవుతున్న బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాన్ని భారతీయ సినిమా పరిశ్రమలో నిర్మాతల పాలిట బంగారు నిధి అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నెల 28న విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌కు ముందే నిర్మాతకు పలు మార్గాల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. 2015లో విడుదలైన బాహుబలి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రూ.500 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న బాహుబలి2 చిత్రం రూ.250 కోట్లతో రూపొందగా విడుదలకు ముందే రూ.500 కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్నీ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకొందాం.

    రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల

    రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల

    బాలీవుడ్‌లో బడా హీరోలు అనుకునే వారి సినిమాలు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4500 వేల థియేటర్లకు మించి విడుదల కాలేదు. కానీ ప్రాంతీయ చిత్రంగా పేరొందిన బాహుబలి2 చిత్రం హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 6500 థియేటర్లకు పైగా రిలీజ్ కానున్నది.

    రిలీజ్‌కు ముందే రూ.500 కోట్లు

    రిలీజ్‌కు ముందే రూ.500 కోట్లు

    దేశ చరిత్రలోనే విడుదలకు ముందే రూ.500 కోట్ల బిజినెస్ జరిగిన తొలి చిత్రం కేవలం బాహుబలి మాత్రమేనట. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా పంపిణీ హక్కుల కింద రూ.250 కోట్లు, ఓవర్సీస్ హక్కుల కింద మరో రూ.100 కోట్లు వచ్చయాట. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు శ్రీధర్ పిళ్లై వెల్లడించారు.

    రైట్స్‌తోనే నిర్మాత రైట్ రైట్

    రైట్స్‌తోనే నిర్మాత రైట్ రైట్

    బహుబలి చిత్రానికి పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని నిర్మాత తన అకౌంట్లో వేసుకొన్నాడు. ఆ మొత్తాన్ని శాటిలైట్, హిందీ, ప్రాంతీయ టెలివిజన్ హక్కులు కింద రూ.78 కోట్లు వచ్చాయి. హిందీ హక్కుల కోసం ప్రముఖ టెలివిజన్ సంస్థ సోని పిక్చర్స్ నెట్‌వర్స్ రూ.50 కోట్లు చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. ప్రాంతీయ భాషలైన తమిళం, తెలుగు, మలయాళానికి సంబంధించిన హక్కులను రూ.28 కోట్లు చెల్లించి స్టార్ ఇండియా సొంతం చేసుకొన్నది.

    ఆన్‌లైన్‌ ప్రమోషన్‌లో సోని

    ఆన్‌లైన్‌ ప్రమోషన్‌లో సోని

    బాహుబలి చిత్రాన్ని ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలైన సోని ఎల్ఐవీ, హాట్‌స్టార్‌లో ప్రసారం చేసే హక్కులను కూడా సోని దక్కించుకొన్నది. అలాగే బాహుబలి కథ ఆధారంగా కామిక్ బుక్స్, నవలలు, యానిమేషన్, వీడియో గేమ్స్ తదితర రూపాల్లో అదనంగా మరో రూ.10 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు పిళ్లై వెల్లడించారు.

    కళ్లు చెదిరే ధరకు మ్యూజిక్ రైట్స్

    కళ్లు చెదిరే ధరకు మ్యూజిక్ రైట్స్

    ప్రమఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చిన బాహుబలి2 మ్యూజిక్ ఆల్బమ్ సినిమా రెవెన్యూలో సుమారు 10 శాతం ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ అనలిస్టుల అంచనా. ఈ మొత్తంలో అధిక భాగం కీరవాణి రెమ్యూనరేషన్ కింద తీసుకొనే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.

    తొలిరోజే వంద కోట్లు..

    తొలిరోజే వంద కోట్లు..

    బాలీవుడ్‌లో అగ్ర హీరోలకు కలెక్షన్లను తలదన్నేలా బాహుబలి2 చిత్రం కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం తొలిరోజే రూ.100 కోట్ల మార్కును దాటే అవకాశమున్నట్టు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే దేశ సినీ పరిశ్రమ చరిత్రలో బాహుబలి2 రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది.

    ప్రమోషన్‌ కోసం భారీగా ఖర్చు

    ప్రమోషన్‌ కోసం భారీగా ఖర్చు

    సినిమాల ప్రమోషన్‌కు సంబంధించిన బడ్జెట్‌పై దక్షిణాది ఫిలిం చాంబర్లలో పరిమితి ఆంక్షలు విధించారు. అలాంటి ఆంక్షలకు కట్టుబడి ఉండి ప్రమోషన్ కొనసాగించినట్లయితే బాహుబలి2 పబ్లిసిటీ కోసం సౌ‌త్‌లో సుమారు రూ.4 కోట్లు, బాలీవుడ్ కోసం రూ.9 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఉత్తరాదిలో ఏప్రిల్ మొదటి వారం నుంచే బాహుబలి2 చిత్రానికి సంబంధించిన ప్రయోషన్ కార్యక్రమం మొదలైనట్టు తెలుస్తున్నది. దాదాపు తమ బడ్జెట్‌లో సుమారు 25 శాతాన్ని ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.

    సోషల్ మీడియాలో దుమ్ము రేపేలా

    సోషల్ మీడియాలో దుమ్ము రేపేలా

    పలు రకాల ప్రింట్ అడ్వర్టయిజ్‌మెంట్స్, పోస్టర్లు, ఇతర మార్కెట్ సాధానాల ద్వారా ఈ చిత్రంపై ప్రేక్షకుల పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీ నాటికి ఆడియెన్స్‌లో ఆసక్తి, క్రేజ్ పెంచే విధంగా చర్యలు తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది. నెటిజన్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియా ప్రమోషన్‌పై కూడా నిర్మాతలు దృష్టిపెట్టినట్టు సమాచారం.

    ప్రముఖుల చేత సోషల్ మీడియాలో..

    ప్రముఖుల చేత సోషల్ మీడియాలో..

    బాహుబలి2 చిత్రానికి సంబంధించిన విషయాలను బాలీవుడ్ ప్రముఖుల చేత వారి సోషల్ మీడియాలో చర్చించే విధంగా ప్లాన్ చేస్తున్నరట. దాంతో ఉత్తరాదిలో ఉన్న ఆయా హీరోల ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు నెలకొనడానికి ఇలాంటి ప్రమోషన్ తోడ్పడే అవకాశం ఉంది.

    బ్రాండింగ్ పార్టనర్స్...

    బ్రాండింగ్ పార్టనర్స్...

    బాహుబలి2 చిత్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పలు ఉత్పత్తి కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, చైనా మొబైల్ కంపెనీ ఓప్పో, అమ్రాపాలి జ్యువల్లరీ సంస్థలు బ్రాండింగ్ పార్టనర్లుగా ఉన్నాయి. ఈ సంస్థలు తమ సామర్థ్యాన్ని బట్టి బాహుబలి నిర్మాతలకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు చెల్లించే అవకాశం ఉంది.

    పక్కా ప్రణాళికలతో నిర్మాతలు ముందుకు..

    పక్కా ప్రణాళికలతో నిర్మాతలు ముందుకు..

    పలు రకాల మార్కెటింగ్ వ్యూహాలతో ఆర్కా మీడియా సీఈవో, సహ వ్యవస్థాపకుడు శోభు యార్లగడ్డ ముందుకు దూసుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకొని పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రేక్షకుల అంచనాలను తలదన్నేలా ఈ చిత్ర ఉంటుంది. ఇండియన్ సినిమా చరిత్రలో అన్ని అంశాలలో బాహుబలి2 ఓ మైలురాయిగా నిలిచిపోతుంది అని నిర్మాత శోభు యార్లగడ్డ అన్నారు.

    English summary
    ‘Baahubali 2: The Conclusion’ movie has already been declared as Gold mine for Producers. This film's business matters no matching to Indian film Industry statistics. Brandig, Social media, other media promotions are talk of the Industry now. This movie slated to release on April 28th with Big bang.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X