twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ బంద్: సంక్రాంతికి షాకే! లాభం ఎవరికి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్లు...తాజాగా టాలీవుడ్లో మొదలైన సినీ వర్కర్స్, టెక్నీషియన్స్ యూనియన్ నిరవదిక సమ్మె సంక్రాంతికి విడుదలయ్యే పెద్ద తెలుగు సినిమాలపై పడేట్లు కనిపిస్తోంది.ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్-వెంకటేష్ నటించిన ‘గోపాలా గోపాలా'తో పాటు జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

    ఈ సినిమాలు సంక్రాంతికి సక్రమంగా విడుదల కావాలంటే....ఇంకా మిగిలి ఉన్న షూటింగ్ పనులు, పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం మొదలైన సమ్మె రెండు మూడు రోజుల్లో ముగిస్తే సరి. వారం పది రోజులకు మించి కొనసాగితే ఈ పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదల చేసుకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది.

    Strike problem to Tollywood

    అదే జరిగితే....ఆ సమయంలో విడుదలయ్యే తమిళ అనువాద చిత్రాలకు లాభం చేకూరే అవకాశం ఉంది. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఐ' చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ ‘లింగా' కూడా డిసెంబర్ 12న విడుదలవుతోంది. సినీ వర్కర్స్ యూనియన్, టెక్నీషియన్స్ సమ్మె ఇలానే కొనసాగితే తిప్పలు తప్పవని అంటున్నారు.

    ఫిల్మ్ చాంబర్ వేతనాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నా..... ఫిల్మ్ ఛాంబర్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు అసంబద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ సినీ కార్మిక సమాఖ్య బంద్ కు పిలుపునిచ్చింది. నేటి నుండి టింగులన్నీ ఆగిపోయాయి. అయితే ఫిల్మ్ ఛాంబర్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు సినీ కార్మిక సమాఖ్య తెలిపింది.

    English summary
    Strike problem to Tollywood. It is well-known fact that there has been an ongoing fight between the producers and the film artistes and technicians.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X