»   »  దిల్ రాజు రైట్స్ తీసుకున్నాడు..ఇక పండుగే

దిల్ రాజు రైట్స్ తీసుకున్నాడు..ఇక పండుగే

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దిల్ రాజు ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం మిగతా డిస్ట్రిబ్యూటర్స్ లో కలుగుతుంది. అందుకు తగినట్లుగానే ఈ సంవత్సరం 'పటాస్' తో మొదలైన ఆయన విజయయాత్ర 'బాహుబలి', రుద్రమదేవి, రీసెంట్ గా కుమారి 12 ఎఫ్ వరకు కొనసాగుతూనే వుంది.

తాజాగా దిల్ రాజు దృష్టి ఓ చిన్న సినిమా పై పడడంతో ఆ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు.. సుధీర్ బాబు నటించిన 'భలే మంచి రోజు'. ఈ మధ్యే ప్రివ్యూ చూసిన రాజు మరో ఆలోచన లేకుండా నైజాం ఏరియా రైట్స్ కోసం నిర్మాతల చేతిలో అడ్వాన్స్ పెట్టేశాడని సమాచారం. దాంతో నిర్మాతలు, సుధీర్ బాబు ఆనందానికి అంతేలేదంటున్నారు.

శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం 'భలే మంచి రోజు'. సుధీర్‌బాబు హీరో. వామిఖ హీరోయిన్. విజయ్‌కుమార్‌ రెడ్డి, శశిధర్‌రెడ్డి నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Sudheer Babu's Bhale Manchi Roju  rights to Dil Raju.

నిర్మాతలు మాట్లాడుతూ ''ఒకే ఒక్కరోజు జరిగే కథ ఇది. సన్నివేశాలన్నీ ఉత్కంఠ కలిగిస్తాయి. సుధీర్‌బాబుకి ఈ చిత్రం సరికొత్త ఇమేజ్‌ తీసుకొస్తుంది. సాయికుమార్‌ పాత్ర కీలకం. ఆయన నటన ఆకట్టుకొంటుంది. ఇటీవల విడుదలైన గీతాలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.

కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌. ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, పి.ఆర్‌.వో- ఏలూరు శ్రీను, కో-డైర‌క్టర్- శ్రీరామ్‌ రెడ్డి, నిర్మాత‌లు-విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శక‌త్వం- శ్రీరామ్ ఆదిత్య.

English summary
Dil Raju Bags Bhale Manchi Roju Movie Nizam Rights. Sudheer Babu starrer Bhale Manchi Roju, has completed all production formalities and is gearing up for big release on Christmas festival - December 25th.
Please Wait while comments are loading...