twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంత భారీ రిలీజ్ అంటే...ఒక్క చెన్నైలోనే 37 థియేటర్లు!

    By Srikanya
    |

    చెన్నై: స్టార్ హీరోల సినిమాలు తొలి రోజే ఎంత ఎక్కువ మందికి చేరువ అయ్యేలా రిలీజ్ చేసామన్న విషయం మీదే దర్సక,నిర్మాతలు దృష్టిపెడుతున్నారు. సినిమా జయాపజయాలకు సంభంధం లేకుండా తొలి వారంలోనే కలెక్షన్స్ లాగేయటానికి అవకాసం ఉంటుంది. ఇదే స్టాటజీని ఇన్నాళ్లూ మన తెలుగులో నిర్మాతలు అనుసరిస్తున్నారు. తమిళంలోనూ మెల్లిగా ఆ కల్చర్ వచ్చేసింది. ఈ వారం విడుదల కానున్న అంజాన్ చిత్రం విడుదల భారీగా జరుగుతోంది.

    లింగుస్వామి దర్శకత్వంలో సూర్య, సమంత జంటగా నటించిన 'అంజాన్‌' దక్షిణాదిలో ప్రత్యేకత చాటుకుంటోంది. తెలుగులోనూ 'సికిందర్‌'గా విడుదలవుతోంది. తెలుగు, తమిళంలో దాదాపు 1,500 థియేటర్లలో విడుదలవుతున్నట్లు సమాచారం. చెన్నైలోనే ఏకంగా 37 థియేటర్లలో రానుంది. నగర హక్కులను అభిరామి రామనాథన్‌ కొనుగోలు చేశారు.

    Suriya’s Anjaan Releasing 37 Theatres in Chennai

    రామ్ నాధన్ మాట్లాడుతూ.. ''గతంలో చెన్నైలో ఐదు థియేటర్లలోనే సినిమా విడుదలయ్యేది. రజనీకాంత్‌ నటించిన 'శివాజి' గరిష్ఠంగా 18 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు 'అంజాన్‌'ను 37 హాళ్లలో విడుదల చేస్తున్నాం. అభిమానులకు టికెట్లు లభించలేదని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. పైరసీ సీడీలను అడ్డుకోవడానికి కూడా ఈ చర్య ఉపయోగపడుతుంది. అభిరామి థియేటర్లలో రిజర్వేషన్‌ ప్రారంభించిన రెండు గంటలకే 5,000 టికెట్లు అమ్ముడయ్యాయి. తప్పకుండా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది''అని తెలిపారు.

    'మాట్రాన్‌' పరాజయం తర్వాత సూర్య 'సింగం-2'తో మళ్లీ బాక్సాఫీసు వద్ద గర్జించారు. తన తదుపరి చిత్రానికి కూడా మాస్‌ కథనే ఎంచుకున్నారాయన. ఆయనకు జంటగా సమంత తొలిసారిగా కనిపించనుంది. యువన్‌శంకర్‌రాజా స్వరాలు సమకూర్చుతుండగా.. సంతోష్‌ శివన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సూర్య ఇందులో ముంబయి డాన్‌గా కనిపించనున్నారు.

    విద్యుత్‌ జమ్వాల్‌, మనోజ్‌బాజ్‌పాయ్‌, వివేక్‌, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, తిరుపతి బ్రదర్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.

    English summary
    Abirami Ramanathan who has acquired the Chennai theatrical rights of Suriya’s Anjaan is so much enthralled over the good response in business and says, “We had released Rajnikanth’s Sivaji in 18 theatres in Chennai and later many in the distribution circle followed the same pattern. Now it is so delightful to mention that we are releasing Suriya’s Anjaan in 37 theatres.This is our earnest attempt to take the film at every nearest theatre to audience as possible, so as to curb the rate of piracy as they wouldn’t be disappointed of not getting tickets. Last night, we opened the online booking plans of Anjaan and 5000 tickets were sold within a span of 2 hours.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X