twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దగ్గరకి వచ్చింది కానీ..: ‘టెంపర్’ రికవరీ ఎక్కడ...ఎంతెంత

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లడంతో పాటు మంచి కలెక్షన్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పది రోజులు తర్వాత బ్రేక్ ఈవెన్ రావాల్సిన సమయంలో డ్రాప్ అవటం మొదలైంది. దాంతో సూపర్ హిట్ టాక్ నడుస్తున్నా కలెక్షన్స్ ఆ స్ధాయిలో కనపడటం లేదు. ట్రేడ్ లో చెప్పుకునే లెక్కలు ప్రకారం ఏయే ప్రాంతాల్లో ఎంతెంత రికవరీ అయ్యిందో ఓ సారి చూద్దాం...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    నైజాం - 94%

    సీడెడ్ - 88%

    వైజాగ్- 72%

    గుంటూరు- 81%

    కృష్ణా - 78%

    తూర్పు గోదావరి- 78%

    పశ్చిమ గోదావరి- 62%

    నెల్లూరు- 67%

    ఓవర్ సీస్-100%

    కర్ణాటక -100%

    దేశంలో మిగతా ప్రాంతాలు - 100%

    గమనిక: ఇవన్నీ కేవలం ట్రేడ్ లో చెప్పుకోబడుతున్న లెక్కలు మాత్రమే. అధికారిక లెక్కలు కావు.

     Temper Distributors Recovery - Territory Wise

    చిత్రం విషయానికి వస్తే...

    ఇప్పుడు ఈ చిత్రానికి మరింత పికప్ ఇవ్వడానికి చిత్రంలో మరిన్ని సీన్స్ కలుపుతున్నట్లు సమాచారం. లెంగ్త్ ఎక్కువ అవుతుందని భావించి ఎడిటింగ్ లో తొలిగించిన కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో కలువనున్నట్లు తెలుస్తోంది.

    ముఖ్యంగా ...అలి, సప్తగిరి మధ్య ఓ కామెడీని తీసి కట్ చేసేసారట. దాంతో సినిమాలో అది అర్దాంతరంగా ముగిసిన ఫీలింగ్, కామెడీ లేదనే కామెంట్స్ వచ్చాయి. దాంతో వీటిని కలిపి కొత్త వెర్షన్ ని వదులుతారని తెలుస్తోంది. చిత్రం రిలీజైన 30 వ రోజు సందర్భంగా వీటిని యాడ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. 35 కోట్ల షేర్ వద్ద చిత్రం డ్రాప్ అవటం ప్రారంభం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల భోగట్టా. దాంతో టెంపర్ కలెక్షన్స్ 50 కోట్లు చేరుతాయని భావిస్తున్నారు.

    ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ స్టార్ స్టేటస్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రం తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. రెండో రోజు కొంచెం డల్ గ ఉన్నా, క్రికెట్ ఫీవర్ తో శనివారం కలెక్షన్స్ డ్రాప్ అయినా...మళ్లీ పుంజుకుంది. శివరాత్రి రోజు అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ అయ్యి దుమ్ము దులిపింది. ఇలా ఆరు రోజుల పాటు కొంచెం అటూగా డీసెంట్ గానే వర్కవుట్ అయ్యింది.

    అయితే నాయుడుగారి మృతితో సురేష్ ప్రొడక్షన్స్ వారి థియోటర్స్ లో షోలు పడలేదు. గురువారం ఈ సినిమాకు కలెక్షన్స్ పరంగా కీలకమైంది. కానీ థియోటర్స్ క్లోజ్ కావటంతో అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు.

    నైజాం, సీడెడ్ లో కలెక్షన్స్ మొదటి నుంచి బాగానే ఉంటూ వస్తున్నాయి. అయితే ఆంధ్రా మాత్రం డల్ అయ్యింది. ఆరవ రోజు న నైజాం, ఆంధ్రా కలిసి రెండు కోట్లు మాత్రమే కలెక్టు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

    ఇవికాకుండా...

    ఈ చిత్రం హిందీ లో రీమేక్ చేయటానికి సచిన్ జోషి సిద్దపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఈ నేపధ్యంలో హిందీ వెర్షన్ కు గన్ డే, రామ్ లీల చిత్రాల హీరోగా రణవీర్ సింగ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా సచిన్ ..రణబీర్ ని ఎప్రోచ్ అయినట్లు సమాచారం. బ్లాంక్ చెక్ ని రెమ్యునేషన్ గా ఆఫర్ చేసాడని, అయితే రణబీర్..చిత్రం చూసి చెప్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రణబీర్ తప్పక ఒప్పుకుంటాడు అంటున్నారు.

    శివబాబు బండ్ల సమర్పించిన సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ లాంటి పార్టీని ఏర్పాటు చేసిన నిర్మాత బండ్ల గణేష్ ... ఈ ఫొటోని అప్ లోడ్ చేసి... టెంపర్ 2 ని ప్రకటించారు. ఆయన ట్వీట్ చేస్తూ...‘' మీ అభిమానం, ప్రేమతో...టెంపర్ 2 రెడీ చేస్తాము ‘' అన్నారు.

    ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించిన ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది.

    ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ జంటగా నటించిందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్‌ కొట్టారు.

    ఓపెనింగ్ డే ఈ చిత్రం రూ. 9.68 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూడో సినిమాగా రికార్డుల కెక్కింది. రూ. 10.75 కోట్ల వసూళ్లతో ‘అత్తారింటికి దారేది' చిత్రం మొదటి స్థానంలో ఉండగదా, రూ. 9.74 కోట్లతో ‘దూకుడు' రెండో స్థానంలో ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ‘టెంపర్' మూవీ దాదాపు 22 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ పర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, పూరి డైరెక్షన్, డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎన్టీఆర్-కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సైతం ప్రక్షకులను కట్టిపడేస్తున్నాయి

    టెంపర్ కథేమిటంటే...

    వైజాగ్ ట్రాన్సఫరై వచ్చిన దయ(ఎన్టీఆర్) ఓ పూర్తి అవినీతి పోలీస్ ఆఫీసర్. అక్కడ వాల్టేర్ వాసు(ప్రకాష్ రాజ్) అనే లోకల్ డాన్ తో చేతులు కలుపి అతని అరాచకాలలో సాయం చేయటం మొదలెడతాడు. మరో ప్రక్క దయ ఓ యానిమల్ లవర్ (కాజల్) తో ప్రేమలో పడతాడు. ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఓ కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేర్చే క్రమంలో దయ...దయగా మారతాడు...వాసు సామ్రాజ్యాన్ని కూల దోయటం మొదలెడతాడు. అంతేకాక చివరకు తన ప్రాణాలమీదకు సైతం తెచ్చుకుంటాడు. ఇంతకీ దయ గర్ల్ ఫ్రెండ్ కోరిన కోరిక ఏమిటి... దయ లో మార్పుకు కారణమైన ఆ సంఘటన ఏమిటి... అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    Except for Overseas, Karnataka and Rest of India, 'Temper' is yet to reach break-even in all the other territories after its 10 days Box Office run.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X