twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి రికార్డుకు మూడినట్టే.. తరుముకొస్తున్న దంగల్.. 30 కోట్లే తేడా!

    బాక్సాఫీస్ వద్ద బాహుబలి, దంగల్ చిత్రాల మధ్య కలెక్షన్ల యుద్ధం రంజుగా కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి రికార్డుస్థాయి కలెక్షన్లను సాధిస్తూ రూ.1577 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది.

    By Rajababu
    |

    బాక్సాఫీస్ వద్ద బాహుబలి, దంగల్ చిత్రాల మధ్య కలెక్షన్ల యుద్ధం రంజుగా కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి రికార్డుస్థాయి కలెక్షన్లను సాధిస్తూ రూ.1577 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. అయితే బాహుబలి రికార్డును ప్రస్తుతం దంగల్ తరుముకుంటూ వస్తున్నది. చైనాలో దంగల్ చిత్రం ప్రభంజనం కొనసాగిస్తూ రూ.775 కోట్లను సాధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా దంగల్ కలెక్షన్లు రూ.1546 కోట్లుగా నమోదైంది. ఇపుడు వాటి మధ్య ఉన్న తేడా కేవలం 31 కోట్లు కావడం గమనార్హం. బాహుబలి2 రికార్డును త్వరలోనే దంగల్ అధిగమిస్తుందనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

    చైనాలో దంగల్ హవా

    ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 రిలీజ్ తర్వాత అమీర్ ఖాన్ నటించిన దంగల్ మే 5వ తేదీన చైనాలో విడుదలైంది. అప్పటి నుంచి భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. మే 23 తేదీ మంగళవారం దంగల్ రూ.17 కోట్లు వసూలు చేసి మొత్తంగా 775.93 కోట్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. మరో రెండు రోజుల్లో రూ.800 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

    బాహుబలి2 రికార్డు బ్రేక్ కలెక్షన్లు

    బాహుబలి2 రికార్డు బ్రేక్ కలెక్షన్లు

    ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ఇప్పటివరకు రూ.1577 కోట్లు సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నది. ఇప్పట్లో బాహుబలి2 సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టే అవకాశం లేదని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

    భారీ బడ్జెట్.. చిన్న బడ్డెట్

    భారీ బడ్జెట్.. చిన్న బడ్డెట్

    బాహుబలి2 సినిమా సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రం రూ.1577 కోట్ల వసూళ్లను సాధించింది. అలాగే దంగల్ చిత్రం రూ.70 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. ఈ చిత్రం రూ.1546 కోట్లను కలెక్షన్లను సాధించింది. నోట్ల రద్దు సమయంలో విడుదలైన దంగల్ ఇతర చిత్రాలకు భిన్నంగా దేశంలో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడం గమనార్హం.

    సినిమాకు పరిమితులు లేవు

    సినిమాకు పరిమితులు లేవు

    చైనాలో దంగల్ విజయంపై బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ స్పందించాడు. ప్రపంచవ్యాప్తంగా భాషకు, సంస్కృతికి ఎలాంటి పరిమితులు లేవని దంగల్ సినిమా నిరూపించింది. ఇండియాలనే కాదు చైనాలో కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మానవ సంబంధాలు, ఎమోషన్స్‌తో కూడిన చిత్రానికి భాష, ప్రాంతం అనే భేదం లేకుండా చూస్తున్నారు అని అమీర్ ఖాన్ అన్నారు.

    సీక్రెట్ సూపర్‌స్టార్‌లో..

    సీక్రెట్ సూపర్‌స్టార్‌లో..

    అమీర్ ఖాన్ ప్రస్తుతం సీక్రెట్ సూపర్ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమీర్ మ్యూజిక్ కంపోజర్‌గా నటిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దంగల్ ఫేం జైరా వసీం నటిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదలయ్యేందుకు సిద్దమవుతున్నది.

    English summary
    Aamir Khan-starrer Dangal and SS Rajamouli's Baahubali 2: The Conclusion have emerged to be two of India's biggest box-office hits of all time. The best part is that their box-office run hasn't stopped yet. Neither are they showing any signs of stopping.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X