twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు ఆలోచన ఏంటి?: సూర్య సినిమాపై ఎందుకు‘సుప్రీమ్’వదిలాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: సినిమా అంటేనే కోట్లతో వ్యాపారం. ఏ మాత్రం తేడా వచ్చినా లెక్కలు తేల్చుకోవటం చాలా కష్టం. అందుకే ప్రతీ విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తూంటారు. అందులోనూ దిల్ రాజు లాంటి సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఒకటికి నాలుగు సార్లు తన ప్రొడక్ట్ని మార్కెట్ లో పెట్టేటప్పుడు ఆలోచించి, స్టెప్ తీసుకుంటాడు. తాజాగా ఆయన దృష్టి మొత్తం సుప్రీమ్ పైనే ఉంది.

    పూర్తి వివరాల్లోకి వెళితే...ఒక రోజు తేడాలో ఈ వారం రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల తీర్పు కోసం ధియోటర్స్ లో దిగుతున్నాయి. అవి 'సుప్రీమ్',సూర్య '24'. అలాగే ఈ సినిమాలు డైరక్ట్ చేసిన విక్రమ్ కుమార్, అనీల్ రావిపూడి గత చిత్రాలు మనం, పటాస్ సూపర్ హిట్ కావటం జరిగింది. దాంతో రెండింటి మీదా మంచి అంచనాలే ఉన్నాయి.

    రెండింటిపైనా ఇండ‌స్ట్రీలో ఆస‌క్తి ఉండ‌డంతో ఈ రెండింట్లో ఏ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డుతుందో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. స్దాయి ప‌రంగా చూసుకుంటే సూర్య‌నే పెద్ద హీరో. కానీ ఈ త‌మిళ్ స్టార్ సినిమా తెలుగులో స‌క్సెస్ సాధించిన చాలా కాల‌మే అయింది. '24' డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కావ‌డంతోనే ఈ స్దాయి ఆస‌క్తి మొద‌లైంది.

    This week releases: Supreme Vs Surya's 24

    కానీ 'సుప్రీమ్' విష‌యానికొచ్చేస‌రికి చాలానే పాజిటివ్ సెంటిమెంట్స్,ఎలిమెంట్స్ యాడ్ అవుతున్నాయి. సాయిధ‌ర‌మ్ తేజ్ ఎర్లియ‌ర్ మూవీ 'సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్' ఈజీగా 20 కోట్లు క‌లెక్ట్ చేసి ఈ మెగా హీరో స్టామినాను తెలియ‌జెప్పింది. మ‌రో ప‌క్క 'ప‌టాస్' తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు కొట్టిన అనిల్ రావిపూడి ఈ సినిమా డైరెక్ట‌ర్ కావ‌డం, దీన్నిదిల్ రాజు నిర్మించ‌నుండ‌డం, 'సుప్రీమ్' పై ఎక్స్పెక్టేష‌న్స్ ఎక్కువ‌గానే ఉన్నాయి.

    ఒక‌రోజు ముందే థియేట‌ర్స్ లోకి వ‌స్తుండ‌డం క‌లెక్ష‌న్స్ ప‌రంగా 'సుప్రీమ్' కు అడ్వాంటేజ్. వీకెండ్ వ‌రుకూ నో డౌట్. ఆ త‌రువాత టాక్ బాగుంటే 'స‌రైనోడు' ఊపులో ఉన్న మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కలెక్ష‌న్స్ కుమ్మేయ‌డంలో బోలెడంత ప్లప్ అవుతారని భావిస్తున్నారు.

    కానీ '24'థియేట‌ర్స్ వ‌ద్ద నిలబడాలంటే కంటెంట్ ఒక్క‌టే ఆధారం. అందుకే '24'కి, 'సుప్రీమ్' సినిమాల‌కి థియేట‌ర్స్ వ‌ద్ద టగ్ ఆఫ్ వార్ త‌ప్ప‌దు.

    This week releases: Supreme Vs Surya's 24

    'సుప్రీమ్'ని సీన్ లోకి దింపటానికి కారణం...

    వాస్తవానికి సాయిధ‌రమ్ తేజ్ హీరోగా వ‌స్తున్న 'సుప్రీమ్' కు మే నెల్లో రిలీజ్ కు సరైన సమయం దొర‌క‌లేదు. మరో ప్రక్క 'బ్ర‌హ్మోత్స‌వం' లాంటి పెద్ద సినిమాతో పోటీ ఎందుక‌న్న‌ట్టు దిల్ రాజు సైలెంట్ అయ్యాడు. కానీ ఒక వేళ 'బ్ర‌హ్మోత్స‌వం' సినిమాకి యావ‌రేజ్ టాక్ వ‌స్తే 'సుప్రీమ్' ను మే 24న రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు మ‌రో కోణంలో ఆలోచించాడు. కానీ బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ సంగతి అంత త్వరగా తేలేటట్లు కనపడటం లేదు.

    మరో ప్రక్క ఎప్పుడైతే '24' సినిమా మే 6న రిలీజ‌ని డిక్లేర్ అయిందో ఆ వెంట‌నే దిల్ రాజు మ‌న‌సు మార్చుకున్నాడ‌ట‌. సూర్య '24' సినిమా ప‌క్కా క్లాస్ సినిమా. 'సుప్రీమ్' ప‌క్కామాస్ సినిమా. దాంతో రోజే త‌న మాస్ ట్రీట్ ను జ‌నానికి అందిస్తే బెట‌రని దిల్ రాజు మాస్ట‌ర్ ప్లాన్ వేసాడని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది.

    English summary
    Sai Dharam Tej is arriving with his Supreme and he is at loggerheads with the supremely talented Suriya who is arriving with his movie 24. Both the movies belong to different genres but stardom wise Suriya holds a better ground than Sai Dharam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X