twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ భారీ ప్లాపులు, తెర వెనక డబ్బు రికవరీ ఇలా....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినిమా రంగంలో లాభ నష్టాలు అనేది సర్వ సాధారణం. సినిమా ఆడటం, ఆడక పోవడం అనేది దర్శక నిర్మాతల చేతుల్లోనో, హీరో హీరోయిన్ల కంట్రోల్లోనో అస్సలు ఉండదు. మెజారిటీ ప్రేక్షకులు ఇచ్చే తీర్పు మీదనే సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.

    ఏ సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతోనే మొదలు పెడతారు, అయితే ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి. కొన్ని సినిమాల విషయంలో మిక్డ్స్ రెస్పాన్స్ వస్తుంది. కొన్ని సినిమాలు కొందరికి నచ్చుతాయి, మరికొందరి నచ్చవు. అలాంటపుడు సినిమా యావరేజ్ హిట్ట అవ్వడమో, లేదా కొంత మేర నష్టపోవడమో జరుగాయి. సినిమా ప్రతి ఒక్కరికీ విపరీతంగా నచ్చేస్తే అది బ్లాక్ బస్టరే.

    'బ్రహ్మోత్సవం' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (అఫీషియల్)'బ్రహ్మోత్సవం' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (అఫీషియల్)

    అయితే ఏ ఒక్క ప్రేక్షకుడికీ మెప్పించక పోతే అదని పరమ ప్లాప్. అంటే పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా తిరిగి రాక పోవడం అన్నమాట. కొన్ని సందర్భాల్లో పెట్టుడిలో 20 శాతం కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు... ఇలాంటి సినిమాలను డిజాస్టర్ గా బాప్ అంటూ అభివర్ణిస్తుంటారు.

    సినిమా ప్లాప్ అయితే ఎక్కువ నష్టపోయేది సినిమా డిస్ట్రిబ్యూటర్సే. ఆ తర్వాత నిర్మాత కూడా కొంత భరించాల్సి ఉంటుంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లకు అమ్మే సమయంలోనే నిర్మాతకు, డిస్టిబ్యూటర్లకు ఒప్పందాలు జరుగుతాయి. లాభమైనా, నష్టం అయినా డిస్ట్రిబ్యూటరే భరించాలనే విధంగా కొన్ని ఒప్పందాలు.... లాభ నష్టాల్లో నిర్మాత కూడా బాద్యత తీసుకునేలా మరికొన్ని ఒప్పందాలు ఉంటాయి.

    ముఖ్యంగా స్టార్ సినిమాల విషయంలో లాభనష్టాలను షేర్ చేసుకునేలా ఒప్పందాలు ఉంటాయి. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ ధర పెట్టి కొనాల్సి ఉంటుంది. లాభాలైనా, నష్టాలైనా భారీ మొత్తంలో ఉంటాయి. అందుకే రిస్కు తీసుకోవడం ఇష్టం లేక చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు లాభనష్టాలు షేర్ చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏదైనా తేడా వచ్చినపుడు అందరికీ న్యాయం జరిగేలా ఫిల్మ్ చాంబర్, లేదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది.

    గతంలో బాలయ్య సినిమా విషయంలో గొడవ

    గతంలో బాలయ్య సినిమా విషయంలో గొడవ


    ఎనిమిదేళ్ల క్రితం బాలయ్య నటించిన ఒక్క మగాడు చిత్రం భారీ ప్లాప్ అయింది. తమకు పరిహారం చెల్లించాలని అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాలు చేసారు.

    20 శాతం కంటే ఎక్కువ నష్టపోతే

    20 శాతం కంటే ఎక్కువ నష్టపోతే


    డిస్ట్రిబ్యూటర్ 20 శాతం కంటే ఎక్కవగా నష్టపోతే నిర్మాత తిరిగి చెల్లించాలనే ఒప్పందాలు చాలా కాలంగా నడుస్తున్నాయి.

    సర్దార్ గబ్బర్ సంగ్

    సర్దార్ గబ్బర్ సంగ్


    ఇటీవల విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ అంచనాలను అందుకోలేక పోయింది. అయితే ఈ సినిమా వల్ల కొందరు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే నష్టపోయారు. సినిమా కంప్లీట్ డిజాస్టర్ కాదు.

    భరోసారి ఇచ్చిన పవన్

    భరోసారి ఇచ్చిన పవన్


    పవన్ కళ్యాణ్ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇచ్చారు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో నష్టాలను సెటిల్మెంట్ చేస్తామని చెప్పడంతో అంతా కూల్ అయ్యారు.

    బ్రహ్మోత్సవం

    బ్రహ్మోత్సవం


    తాజాగా విడుదలైన బ్రహ్మోత్సవం విషయంలో భారీ నష్టాలే వచ్చాయి. పెట్టుబడిలో సగం కూడా తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. ముఖ్యంగా నైజా డిస్ట్రిబ్యూటర్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి.

    పివిపి భరోసా

    పివిపి భరోసా


    అయితే నిర్మాత పివిపి అందరు డిస్ట్రిబ్యూటర్లతో టచ్ లో ఉంటూ నష్టపోయిన వారందరనీ ఆదుకుంటామని భరోసారి ఇచ్చినట్లు నైజాం డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

    ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్

    ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్


    బ్రహ్మోత్సవం చిత్రం ఓవర్సీస్ రైట్స్ రూ. 13 కోట్లకు అమ్ముడయ్యాయి. సినిమా విడుదలై వారం అయినా సగం కూడా రికవరీ కాలేదు.

    మహేష్ బాబు కూడా...

    మహేష్ బాబు కూడా...


    మహేష్ బాబు కూడా సినిమా నిర్మాణంలో భాగం కావడంతో ఆయన కూడా కొంత భరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

    English summary
    Whenever a big film flops at the box office, distributors and exhibitors make a beeline for the producer, the Film Chamber or Producers’ Council to recover their money. When Balakrishna’s Okka Magadu had flopped eight years back, distributors and exhibitors had actually gone on a hunger strike, asking for compensation for their losses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X