» 

టాప్ 10- ఫస్ట్‌వీక్ కలెక్షన్స్‌ సినిమాలు (ఫొటో ఫీచర్)

Posted by:

హైదరాబాద్: టాలీవుడ్ చిత్ర సీమ భారత సినిమా రంగంలో రెండో అతిపెద్ద పరిశ్రమగా కొనసాగుతోంది. మన చిత్ర పరిశ్రమ నుండి సంవత్సానికి దాదాపు రూ. 1500 కోట్ల ప్రొడక్షన్ కాస్ట్‌గల వందలాది చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అయితే బాక్సాఫీసు వద్ద ఆ చిత్రాలు మొదటి వారంలో చూపే పెర్ఫార్మెన్స్‌ను బట్టే సక్సెస్ ఆధార పడి ఉంటోంది.

ఇప్పటి వరకు టాలీవుడ్లో మొదటి వారం కలెక్షన్స్ పరంగా టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకున్న సినిమాల వివరాలపై ఓ లుక్కేద్దాం....

అత్తారింటికి దారేది


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్లు అత్యధికంగా సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఈచిత్రం తొలివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది.

ఎవడు


రామ్ చరణ్ నటించిన ‘ఎవడు' చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల పరంగా రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.26 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది.

గబ్బర్ సింగ్


పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.24 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి మూడో స్థానంలో నిలిచింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు


మహేష్ బాబు, వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.51 కోట్లు సాధించి మొదటి వారం కలెక్షన్ల విషయంలో నాలుగో స్థానం దక్కించుకుంది.

నాయక్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘నాయక్' చిత్రం మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.01 కోట్ల వసూలు చేసి ఐదో స్థానంలో నిలిచింది.

బాద్ షా


యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా' చిత్రం తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 33.54 కోట్లు వసూలు చేసి ఆరోస్థానంలో నిలిచింది.

రచ్చ


మెగా పవర్ స్టార్ రామ్ చరన్ నటించిన ‘రచ్చ' చిత్రం తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 33 కోట్లు వసూలు చేసింది.

రేసుగుర్రం


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన రేసుగుర్రం చిత్రం తొలివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.88 కోట్లు రాబట్టింది.

కెమెరామెన్ గంగతో రాంబాబు


పవన్ కళ్యాణ్ నటటించిన ‘కెమెరామన్ గంగతో రాంబాబు' చిత్రం తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.88 కోట్లు వసూలు చేసింది.

జులాయి

అల్లు అర్జున్ నటించిన ‘జులాయి' చిత్రం తొలివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 28.09 కోట్లు వసూలు చేసింది.

Read more about: race gurram, attarintiki daredi, yevadu, gabbar singh, naayak, baadshah, racha, julayi, రేసు గుర్రం, అత్తారింటికి దారేది, ఎవడు, గబ్బర్ సింగ్, నాయక్
English summary
Tollywood is the second biggest film industry in India and it shells out more than Rs 1500 crores on the production of hundreds of Telugu movies every year. But most of the time success of a film depends on its performance at the Box Office in the first week. We bring you Top 10 Telugu movies with highest collection in first week.

Telugu Photos

Go to : More Photos