Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫ్లాఫ్ టాక్...కలెక్షన్స్ టాప్...ఇండస్ట్రీ షాక్
ముంబై: వినిపిస్తున్న టాక్ కు కలెక్షన్స్ కు సంభంధం లేకుండా భాక్సాఫీస్ వద్ద ఒక్కోసారి పెద్ద హీరోల చిత్రాలకు మ్యాజిక్ జరుగుతూంటుంది. తాజాగా అలాంటిది బాలీవుడ్ లో జరిగింది. హృతిక్, కత్రినా కైఫ్ ల కాంబినేషన్ లో రూపొందిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం కు మార్నింగ్ షో నుంచే ఫ్లాఫ్ టాక్ వచ్చింది. అయితే కలక్షన్స్ మాత్రం ఊపుతోంది. రిలీజైన ఈ నాలుగు రోజుల్లోనే 94.13 కోట్లు షేర్ (134.47 కోట్లు గ్రాస్)చేసింది. ఈ సంవత్సరం హైయిస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఏడవదిగా రికార్డు క్రియేట్ చేసింది.
చిత్రం కథేమిటంటే...లండన్ లో కోహినూర్ వజ్రం ఉంటుంది. దాన్ని రాజ్ వీర్(హృతిక్ రోషన్)దొంగతనం చేస్తాడు. అయితే ఆ వజ్రాన్ని అతని నుంచి లేపేయటానికి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఓమర్ జాఫర్(డానీ), హమీద్ గుల్(జావెద్ జాఫ్రీ) గ్యాంగ్ వెంటపడుతూంటూంది. అయితే ఈ మాఫియా గ్యాంగ్ లకు దొరకకుండా ఓమర్ జాఫర్ ని ఎలగైనా కలుసుకోవాలని రాజ్ ప్రయత్నిస్తూంటారు. ఇంతకీ రాజ్...ఓమర్ జాఫర్ ని ఎందుకు కలుసుకోవాలనుకున్నాడు. ఈ ఛేజింగ్ లో రాజ్ తో కలిసిన హర్లీన్(కత్రినా) ఎవరు... అసలు కోహినూర్ వజ్రం దొంగతనం వెనక ఉన్న అసలు కథ ఏమిటి తెలుసుకోవాలంటే చిత్రం పూర్తిగా చూడాల్సిందే.
హాలీవుడ్ సినిమా 'నైట్ అండ్ డే'కిది రీమేక్. 2010లో విడుదలైన ఈ చిత్రంలో టామ్ క్రూయిజ్, కెమెరన్ డియాజ్ ప్రధాన పాత్రధారులు. 'బ్యాంగ్ బ్యాంగ్'ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ చిత్రం లాంటి కథ,కథనాలు మనకు గతంలో కొన్ని చిత్రాల్లో వచ్చేసి ఉండటంతో పెద్ద గొప్పగా అనిపించదు. పూర్తి ఛేజింగ్ లతో నడుస్తూండటంతో రెగ్యులర్ సినీ గోయిర్స్ కు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే హృతిక్ రోషన్ చేసిన సాహసాలు, కత్రినా అందచందాలు ఈ సినిమాకు ప్లస్. వీటిని అద్బుత రీతిలో ఆవిష్కరించారు.