» 

ఈగకు కళ్లెం వేయలేక పోయిన బాలయ్య మూవీ!

Posted by:
Give your rating:

నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య పాత్రలో మంచు మనోజ్, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రానికి తొలి వారాంతం బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ చిత్రంతో పాటు విడుదలైన రాజేంద్ర ప్రసాద్ 'ఓనమాలు' చిత్రాన్ని కలెక్షన్ల పరంగా వెనక్కి నెట్టేసిన బాలయ్య, మనోజ్ సినిమా గతంలో రిలీజ్ అయిన రాజమౌళి 'ఈగ' చిత్రం జోరును మాత్రం తగ్గించ లేక పోయింది.

యూఎస్ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం...జూలై 27న విడుదలైన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' పరిమిత సంఖ్య గల స్క్రీన్లలో అమెరికా వ్యాప్తంగా విడుదలైంది. గడిచిన వీకెండ్ లో ఈచిత్రం రూ 38.09 లక్షలు ($ 68,722) కలెక్షన్లు సాధించింది.

దీంతో పాటు రిలీజైన మరో తెలుగు చిత్రం 'ఓనమాలు' చిత్రం క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూ రేటింగుల పరంగా మంచి టాకే వచ్చినా పరిమిత సంఖ్య గల స్క్రీన్లలో విడుదలై యావరేజ్ రెస్పాన్‌తో కలెక్షన్ల పరంగా మాత్రం వీకైంది. ఈ చిత్రం గడిచిన వీకెండ్‌లో రూ. 1.80 లక్షలు ($ 3,243) మాత్రమే వసూలు చేసింది.

అయితే జూలై 6న విడుదలైన రాజమౌళి గ్రాఫికల్ వండర్ చిత్రం 'ఈగ' మాత్రం దాదాపు 25 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ చివరి వీకెండ్‌లో ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. 25 రోజులు గడిచేనాటికి యూఎస్ బాక్సాఫీసులో ఈగ కలెక్షన్లు రూ. 5.87 కోట్లకు చేరుంది. యూఎస్ఏ బాక్సాఫీసు చరిత్రంలో ఒక తెలుగు సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు సాధించడం రికార్డు.

Read more about: balakrishna, uu kodathara ulikki padathara, onamalu, eega, manchu manoj, rajamouli, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, ఓనమాలు, ఈగ, బాలకృష్ణ, మంచు మనోజ్, రాజమౌళి
English summary
Uu Kodathara Ulikki Padathara (UKUP) has opened to a very good response at the USA Box Office in the first weekend. The Balakrishna and Manchu Manoj starrer film has beaten Rajendra Prasad starrer Onamalu at the collection centres in America, but it has failed to slow down the pace of previous release Eega.
Please Wait while comments are loading...
Advertisement
Content will resume after advertisement