twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్-3లో ‘అ..ఆ’, దిల్ రాజు చెప్పిన ఫిగర్ 60 కోట్లు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నితిన్, సమంత ప్రధాన పాత్రల్లో త్రివిక్రమ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాధాకృష్ణ(చినబాబు) నిర్మాతగా తెరకెక్కిన 'అ..ఆ' సినిమా బాక్సాఫీసు వద్ద అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం సూపర్ కలెక్షన్లు సాధిస్తుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలా హ్యాపీగా ఉన్నారు.

    ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మాట్లాడుతూ....'నైజాంలో మేమే రిలీజ్ చేసాం. సినిమా విడుద‌లైన రోజు నుండే సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. నితిన్ కెర్‌లోనే టాప్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. సాధార‌ణంగా జూన్ మొద‌టివారంలో సినిమాలు త‌క్కువ‌గా విడుద‌ల‌వుతాయి. స్కూల్స్ ఓపెనింగ్ కావ‌డంతో పెద్ద‌గా సినిమాలు చూడ‌రని అంద‌రూ అనుకుంటారు. కానీ అఆ సినిమా విష‌యానికి వ‌స్తే సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యింది' అన్నారు.

    రూ. 60 కోట్ల వసూలు చేస్తుంది...
    'నైజాంలో 'అ..ఆ' 5 రోజుల్లోనే ప‌న్నెండు కోట్ల రూపాయ‌ల గ్రాస్ కలెక్ష‌న్స్‌ను సాధించింది. ఈ సినిమాకు ఎ టు జెడ్ అంతా త్రివిక్ర‌మ్ గారే. నా అనుభ‌వాన్ని బ‌ట్టి చూస్తుంటే ఈ చిత్రం ఆర‌వై కోట్ల రూపాయల‌ను కలెక్ట్ చేస్తుంద‌నిపిస్తుంది.' అని దిల్ రాజు అన్నారు.

    ఓవర్సీస్‌లో టాప్
    ఓవర్సీస్‌‌‌లో 'అ..ఆ' మూవీ తొలి వీకెండ్ కలెక్షన్ల పరంగా టాప్-3లో నిలిచింది. స్లైడ్ షోలో పూర్తి వివరాలు..

    ఫస్ట్ వీకెండ్

    ఫస్ట్ వీకెండ్

    ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ 1.7 మిలియన్ డాలర్స్(రూ. 11 కోట్ల పైనే) వసూలు చేసింది.

    నెంబర్ వన్ పొజిషన్లో...

    నెంబర్ వన్ పొజిషన్లో...

    ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ వసూళ్ల పరంగా బాహుబలి 4.4 మిలియన్ డాలర్లతో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది.

    శ్రీమంతుడు

    శ్రీమంతుడు

    ఫస్ట్ వీకెండ్ రెండో స్థానంలో 2.09 మిలియన్ డాలర్ల వసూల్లతో శ్రీమంతుడు చిత్రం ఉంది.

    ఆదరణ అదుర్స్

    ఆదరణ అదుర్స్

    త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంది. ‘అ..ఆ' మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో అదరణ అదిరిపోతోంది.

    English summary
    Tsunami collections for Trivikram's 'A Aa' in USA. The movie has grossed nearly 1.7 million dollars by end of the first weekend. This is third biggest ever opening for a Telugu movie in first weekend after 'Srimanthudu' and 'Baahubali'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X