twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీన్ మారింది: ఎన్టీఆర్ ప్లేస్ లోకి మంచు విష్ణు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ భారీ ఫ్యామిలీ చిత్రం 'రభస' విడుదల మొదట అనుకున్నట్లుగా ఆగస్టు 15న జరగటం లేదని సమాచారం. థియోటర్స్ సమస్య, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కాకపోవటంతో ఈ నెలాఖరకు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆ గ్యాప్ లోకి మంచు విష్ణు తాజా చిత్రం 'అనుక్షణం...అమ్మాయిలూ జాగ్రత్త'వచ్చేస్తోందని సమాచారం. ఆగస్టు 15 న మంచు విష్ణు చిత్రాన్ని విడుదల చేయాలని తేదీని నిర్ణయించారు. ఈ మేరకు థియోటర్స్ ఫైనలైజ్ చేసి, విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

    రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో విష్ణు హీరోగా నటించిన చిత్రం 'అనుక్షణం'. 'అమ్మాయిలూ జాగ్రత్త' అనేది ఉపశీర్షిక. తేజస్వి, రేవతి, మధుశాలిని, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సుప్రీత్‌, శ్రావణ్‌, సన ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రంలో నవదీప్‌ ప్రత్యేక పాత్ర పోషించారు. ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఏర్పాటుచేసిన సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించారు. ఆగస్ట్‌ 1న ప్రారంభించిన ఫిల్మ్‌ ఆక్షన్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ సినిమాను ఆయా ప్రాంతాలకు వేలం నిర్వహిస్తున్నామని తెలిపారు.

    Vishnu Manchu’s Anukshanam on August 15th

    చిత్రం కథ ఏమిటంటే... ''హైదరాబాద్‌ నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించిన ఓ సీరియల్‌ సెక్స్‌ కిల్లర్‌ కథ ఈ చిత్రం. ఈ కిల్లర్‌ కారణంగా రాత్రి ఏడు గంటల తర్వాత మహిళలు తమ ఇళ్లనుంచి బయటకు రావొద్దని పోలీస్‌ కమీషనర్‌ హెచ్చరించే స్థితి ఏర్పడుతుంది. రెస్టారెంట్లు ఖాళీ అయిపోతాయి. థియేటర్లలో రాత్రి ఆటలు రద్దవుతాయి. నగరం రాత్రివేళ నిర్మానుష్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మరింతమంది యువతులను చంపడానికి ప్రయత్నించే హంతకుణ్ణి పోలీసులు పట్టుకోగలిగారా, లేదా? అనేది ఇందులోని ప్రధానాంశం. పూర్తిగా సీరియల్‌ కిల్లర్‌ ప్రధానంగా భారతదేశంలో రూపొందిన మొదటి సినిమా ఇదే'' అని వర్మ తెలిపారు.

    విష్ణు మాట్లాడుతూ 'ఐస్‌క్రీమ్‌'లా ఇది రూ. మూడు లక్షల్లో, ఏడు రోజుల్లో తీసిన సినిమా కాదన్నారు. ''ఈ సినిమాను వేలం ద్వారా అమ్మడమనే కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నాం. రాము ఈ ఐడియా చెప్పినప్పుడు టెన్షన్‌పడ్డాను. నాన్నగారికీ, దాసరి అంకుల్‌కూ ఈ పద్ధతి గురించి చెప్పినప్పుడు మంచి ఆలోచన అనీ, సక్సెస్‌ అయితే అందరికీ మార్గదర్శకులవుతారనీ ప్రోత్సహించారు'' అని ఆయన చెప్పారు.

    English summary
    Vishnu Manchu’s ‘Anukshanam’ is headed to theatres this August 15th. This movie is said to be based on some gruesome real life incidents.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X