» 

‘గ్రీకు వీరుడు' కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?

Posted by:

హైదరాబాద్ : నాగార్జున, నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్రీకు వీరుడు' . మొన్న శుక్రవారం రిలీజైన ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే తెచ్చుకున్నా...మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవటం మైనస్ గా మారింది.

వీకెండ్స్ లో బాగున్నా... సోమవారం నుంచి కలెక్షన్స్ పూర్తి స్ధాయిలో చాలా చోట్ల డ్రాఫ్ అవటం..డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని కలవరపెడుతోంది. దానికి తోడు...అంతకు ముందు ఎప్పుడో రిలీజైన గుండె జారి గల్లంతైందే కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. దాంతో ఎండలకు జనం రావటం లేదని సరిపెట్టుకోవటం కష్టమే అంటున్నారు.

ఇత ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. అమెరికాలో నాగార్జున కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'గ్రీకువీరుడు' నిలిచింది. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'డమరుకం', 'షిరిడి సాయి' చిత్రాల వీకెండ్ కలెక్షన్లను 'గ్రీకు వీరుడు' కేవలం రెండు రోజుల్లోనే సాధించింది.

నాగార్జున డిఫరెంట్ లుక్, నయనతార హీరోయిన్ గా నటించడం, క్లాస్ లవ్ స్టోరీ కావడంతో సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు రోజు(గురువారం) ఈచిత్రం ప్రీమియర్ షో 43 లొకేషన్లలో ప్రదర్శించగా $29,822 వసూళ్లు సాధించింది.

Read more about: greeku veerudu, dasarath, nayantara, nagarjuna, గ్రీకు వీరుడు, దశరథ్, నయనతార, నాగార్జున
English summary
Telugu film Greeku Veerudu starring Akkineni Nagarjuna and Nayantara in leads, has received superb openings. But From Monday collections drop.
Please Wait while comments are loading...