అలియా భట్
Born on 15 Mar 1993 (Age 31)
అలియా భట్ బయోగ్రఫీ
అలియాభట్ 1993 మార్చి 15న ముంబైలో జన్మించింది. సోనీ రజ్జాన్, మహేష్ భట్ దంపతుల కుమార్తె అలియా. ఆమె తల్లి యూకే మహిళ కావడం వలన అలియాకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది.
ఆరేళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర అరంగేట్రం చేసింది అలియా. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రీతి జింటా నటించిన సంఘర్ష్ చిత్రంలో అలియా భట్ నటించింది.
బాలీవుడ్ నిర్మాత- దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో అలియా హీరోయిన్గా నటించింది. 2012లో విడుదలైన ఈ సినిమాలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు.
2013లో టైమ్స్ ఇండియా ఫిల్మ్ అవార్డులలో అలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రానికి గానూ బెస్ట్ ఫీమేల్ డిబ్యూట్ అవార్డ్ అందుకుంది. అలాగే 2015లో హైవే చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది. 2017లో ఉడ్తా పంజాబ్ సినిమాకు గానూ.. ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
ప్రస్తుతం అలియా గంగుబాయి కతియావాడి, బ్రహ్మస్త్రా, ఆర్ఆర్ఆర్, సడక్-2, తఖ్త్, ఇన్షల్లా సినిమాల్లో నటిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది
సంబంధిత వార్తలు