twitter

    అనిల్ రావిపూడి బయోగ్రఫీ

    అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా, అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు.  అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. 


    అనిల్ రావిపూడి చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంటు హాలులో కూర్చుని సినిమాలు చూసే అలవాటు కలిగింది. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు.

    అనిల్ రకయితగా శౌర్యం, శంఖం, దరువు, సుడిగాడు, కందిరీగ, మసాలా, ఆగడు మొదలైన పనిచేసారు. దర్శకుడిగా అనిల్ తొలి సినిమా కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన పటాస్. రెండో చిత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్. రవితేజ కథానాయకుడిగా నటించిన రాజా ది గ్రేట్, వెంకటేష్, వరుణ్ తేజ్ తో F2 సినిమాలతో అగ్రదర్శకుడిగా మారుడు. ప్రస్తుతం మహేష్ 26 సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X