అంజలి
Born on 16 Jun 1986 (Age 37) రాజొల, ఆంద్రప్రదేశ్
అంజలి బయోగ్రఫీ
అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది.
తెలుగమ్మాయి అంజలి హీరోయిన్ గా తమిళంలో మంచి గుర్తింపే సంపాదించుకుంది. తెలుగులో కూడా ఆమె కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు.
సంబంధిత వార్తలు