చార్మి కౌర్
Born on 17 May 1987 (Age 36) ముంబాయి
చార్మి కౌర్ బయోగ్రఫీ
కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది.
పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది. రాఖీ, చిన్నోడు, పౌర్ణమి, స్టైల్, లక్ష్మి, చుక్కల్లో చంద్రుడు, అల్లరి పిడుగు, పొలిటికల్ రౌడీ, అనుకోకుండా ఒక రోజు, చక్రం, మాస్, చంటి, గౌరి, మంత్ర, శ్రీ ఆంజనేయం, నీకే మనసిచ్చాను చిత్రాలలో నటించింది
సంబంధిత వార్తలు