twitter
    CelebsbredcrumbChinmayi
    చిన్మయి

    చిన్మయి

    Singer
    Born : 10 Sep 1984
    చిన్మయి ఒక భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. 1984 సెప్టెంబరు 10న జన్మించింది.  సింగర్‌గా,డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా,మీటూ ఉద్యమకారిణిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్మయి పుట్టి... ReadMore
    Famous For
    చిన్మయి ఒక భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. 1984 సెప్టెంబరు 10న జన్మించింది. 

    సింగర్‌గా,డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా,మీటూ ఉద్యమకారిణిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్మయి పుట్టి పెరిగింది ముంబైలో. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె కుటుంబం చెన్నైకి వచ్చి స్థిరపడింది. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడంతో చిన్నప్పటి నుంచి సంగీత మెళకువలు నేర్చుకునేది.మద్రాస్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసిన చిన్మయికి పలు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. తమిళంతో పాటు తెలుగు,హిందీ, ఇంగ్లీష్,మరాఠీ,మలయాళం,జర్మన్ భాషలను ఆమె స్పష్టంగా మాట్లాడగలదు.
    • 1
      సింగర్‌గా,డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా,మీటూ ఉద్యమకారిణిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిన్మయి శ్రీపాద నేడు 35వ వడిలోకి అడుగుపెడుతున్నారు.
    • 2
      చిన్మయి పుట్టి పెరిగింది ముంబైలో. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె కుటుంబం చెన్నైకి వచ్చి స్థిరపడింది.
    • 3
      సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడంతో చిన్నప్పటి నుంచి సంగీత మెళకువలు నేర్చుకునేది.మద్రాస్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసిన చిన్మయికి పలు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. తమిళంతో పాటు తెలుగు,హిందీ, ఇంగ్లీష్,మరాఠీ,మలయాళం,జర్మన్ భాషలను ఆమె స్పష్టంగా మాట్లాడగలదు.
    • 4
      సినీ కెరీర్‌తోనే సంతృప్తి చెందకుండా.. మీటూ ఉద్యమం ద్వారా లైంగిక వేధింపులపై కూడా పోరాడుతున్న తెగువ ఆమెది.
    • 5
      సన్‌టీవీలో ప్రసారమైన సప్త స్వరంగళ్ అనే షోలో విజేతగా నిలవడం ద్వారా ఆమె ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు.
    • 6
      సింగర్ శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్‌ను పరిచయం చేయించారు. అలా 2002లో అమృత సినిమాతో సింగర్‌గా ప్రయాణం మొదలైంది.
    • 7
      ఆ తర్వాత దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ పాటలు పాడారు. సింగర్‌గా ఎంత పేరు సంపాదించుకున్నారో.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా అంతే పేరు సంపాదించుకున్నారు. త్రిష,తమన్నా,నయనతార,కాజల్,అనుష్క,అమీ జాక్సన్ వంటి హీరోయిన్లకు ఆమె ఇప్పటికీ డబ్బింగ్ చెబుతున్నారు.
    • 8
      ఇండస్ట్రీలో మహా మహులు అనుకునేవాళ్ల పేర్లను సైతం బయటకు లాగి లైంగిక వేధింపులపై చిన్మయి గళమెత్తారు.
    చిన్మయి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X