twitter
    CelebsbredcrumbGirish Karnad
    గిరీష్ కర్నాడ్

    గిరీష్ కర్నాడ్

    Actor
    Born : 19 May 1938
    గిరీష్ కర్నాడ్ మహారాష్ట్రలోని మాథెరన్‌లో 1938 మే 19న జన్మించారు. డాక్టర్ రఘునాథ్ కర్నాడ్, కృష్ణబాయి దంపతుల నలుగురు సంతానంలో గిరీష్ కర్నాడ్ ఒకరు. చిన్నతనం నుంచే నాటకాలు, సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేశారు. గిరీష్... ReadMore
    Famous For
    గిరీష్ కర్నాడ్ మహారాష్ట్రలోని మాథెరన్‌లో 1938 మే 19న జన్మించారు. డాక్టర్ రఘునాథ్ కర్నాడ్, కృష్ణబాయి దంపతుల నలుగురు సంతానంలో గిరీష్ కర్నాడ్ ఒకరు. చిన్నతనం నుంచే నాటకాలు, సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేశారు.

    గిరీష్ కర్నాడ్  కన్నడ చిత్రం 'సంస్కార' ద్వారా 1970లో నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన తెలుగు, తమిళం, మళయాలం చిత్రాలతో పాటు అనేక హిందీ చిత్రాల్లో నటించారు. కర్నాడ్ నటించిన చివరి చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా 2017లో వచ్చిన 'టైగర్ జిందా హై'. ఇందులో RAW చీఫ్ పాత్రలో నటించారు.

    గిరీష్ కర్నాడ్ నటుడినే కాదు... సాహిత్య విభాగంలో అత్యున్నత ప్రభతిభ కనబరిచారు. సాహిత్యంలో భారత పౌరులకు...
    Read More
    • 1
      గిరీష్ కర్నాడ్‌కు కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో మంచి పట్టుంది.
    • 2
      గిరీష్ కర్నాడ్ తన మొదటి నాటకం కన్నడలో రాశారు, తర్వాత దానిని ఇంగ్లిషులోకి అనువదించారు.
    • 3
      ఆయన నాటకాల్లో 'యయాతిట, 'తుగ్లక్', 'హయవదన్', 'అంజు మల్లిగె', 'అగ్నిమతు మాలె' 'నాగమండల్' చాలా ప్రముఖమైనవి.
    • 4
      గిరీష్ కర్నాడ్‌కు 1994లో సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ్ పురస్కారం, 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ లభించాయి.
    • 5
      1972లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1992లో కన్నడ సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ్ పురస్కారం, 1998లో కాళిదాసు అవార్డుతో ఆయన్ను సత్కరించారు.
    • 6
      1970లో కన్నడ సినిమా సంస్కార్‌ నుంచి గిరీష్ కర్నాడ్ నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఆయన మొదటి సినిమాకు రాష్ట్రపతి గోల్డెన్ లోటస్ పురస్కారం లభించింది.
    • 7
      ఆర్‌కే నారాయణ్ పుస్తకం ఆధారంగా బుల్లితెరపై వచ్చిన 'మాల్గుడి డేస్' సీరియల్‌లో ఆయన స్వామికి తండ్రి పాత్ర చేశారు.
    • 8
      1990లో మొదలైన సైన్స్ ఆధారిత టీవీ కార్యక్రమం 'టర్నింగ్ పాయింట్‌'ను హోస్ట్‌ చేశారు.
    • 9
      ఆయన ఆఖరి సినిమా కన్నడ భాషలోనే నిర్మించిన అప్నా దేశ్. ఇది ఆగస్టు 26న విడుదలైంది.
    • 10
      గిరీష్ కర్నాడ్ తెలుగులో చేసిన ఆఖరి సినిమా కొమరం పులి, స్కెచ్ ఫర్ లవ్..
    • 11
      గిరీష్ కర్నాడ్ తెలుగులో ధర్మచక్రం, శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో నటించారు. ప్రేమికుడు లాంటి ఎన్నో డబ్బింగ్ సినిమాల్లో కనిపించారు.
    • 12
      బాలీవుడ్‌లో ఆయన ఆఖరి సినిమా టైగర్ జిందాహై(2017).
    • 13
      ఆయన 10 జూన్ 2019న అనారోగ్యంతో కన్నుమూశారు.
    • 14

    • 15

    • 16

    • 17

    • 18

    • 19

    • 20

    • 21

    • 22

    గిరీష్ కర్నాడ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X