twitter
    CelebsbredcrumbGopichandbredcrumbBiography

    గోపీచంద్‌ బయోగ్రఫీ

    తొట్టెంపూడి గోపీచంద్ తెలుగు సిని నటుడు, టి. కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయిన గోపి చంద్ పుట్టుక, బాల్యం, ప్రాధమిక విద్య మద్రాస్ లో కొనసాగింది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపి ఫై చదువులకోసం రష్యా వెళ్ళాడు. మొదట్లో నటన మీద పెద్దగా ఆసక్తి చూపని గోపిచంద్ సమాజంలో పేరుకుపోయిన సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని విప్లవాత్మక చిత్రాలను రూపొందించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నన్నాడు.

    తమ సొంత బ్యానర్ ఈతరం ఫిల్మ్స్ ఫై 2001 లో 'తొలివలపు' చిత్రం తో హీరోగా పరిచయమం అయ్యాడు. ఆ సినిమా పరాజయం పాలవడంతో నిరాస చెందారు. కానీ గోపి లోని టాలెంట్ ను గుర్తించిన తేజ తన జయం సినిమాలో 'విలన్ గా ఆవకాశం ఇచ్చి గోపిని ప్రోత్సహించాడు. జయంలో అద్భుత నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తరవాత చేసిన 'నిజం', 'వర్షం'  వైవిద్యంగా నటించి ఆడియన్స్ ను మెప్పించాడు. అదే సమయంలో సొంత బ్యానర్ లో 'యజ్ఞం' సినిమాతో తిరిగి హీరోగా రి- ఎంట్రీ ఇచ్చాడు. 


    యజ్ఞం హిట్ అవడంతో గోపి హీరోగా స్థిరపడ్డాడు. నటనలో ప్రవేశించే ముందు ఒక సంవత్సరం పాటు నేర్చుకున్న డైలాగ్ మాడ్యులేషన్ కోర్స్ నటుడి గా మారిన తరవాత గోపీచంద్ కు పెద్ద ప్లస్ అయ్యింది. మంచి ఎత్తుతో, దృడమైన దేహ దారుడ్యంతో, చురుకైన చూపులతో. స్పష్టమైన డైలాగులతో ఒక యాక్షన్ హీరోకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్న గోపిచంద్ ఆనతి కాలంలోనే తెలుగు సినిమాలలో తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. యజ్ఞం తరవాత 'రణం' , 'లక్ష్యం' 'సౌర్యం' వంటి చిత్రాల విజయంతో మాస్ ప్రేక్షకులను అలరించి యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X