twitter

    కైకాల సత్యనారాయణ బయోగ్రఫీ

    కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు.

    కాలేజీ రోజుల్లోనే కైకాలకు నాటకాలపై ఆసక్తి పెరిగింది. నటుడు కావాలని కలలు కంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. వెండితెరకు హీరోగా పరిచయమైన కైకాల.. ఐదు తరాల హీరోలతో సినిమాలు చేశారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించారు.

    ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుతోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి నటులతోనూ సత్యనారాయణ నటించారు.

    కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు కాగా, చివరి చిత్రం మహర్షి. 200 మందికి పైగా దర్శకులతో కైకాల పని చేసారు. ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపు తిరిగింది.ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. రాముడు-భీముడు వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా తన సామర్ధ్యం నిరూపించుకున్నారు.

    60 ఏళ్ళ నటప్రస్థానంలో 777 సినిమాలకు పైనే నటించారు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

    1996లో అతను రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

    మరణం
    అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల  కైకాల సత్యనారాయణ 2022 డిసెంబరు 23న  హైదరాబాదులోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. 




     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X