twitter

    కృష్ణం రాజు బయోగ్రఫీ

    కృష్ణంరాజు 20 జనవరి 1940లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 

    2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఐదున్నర దశాబ్దాల కెరియర్‌లో బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీసావిత్రి, పల్నాటి పౌరుషం, తాతామనవడు, టూటౌన్ రౌడీ తదితర 187 సినిమాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లోనూ సత్తా చాటారు. గోపీకృష్ణ మూవీస్ పతాకం పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు.

     ఆజానుబాహుడైన కృష్ణంరాజు..మొదట హీరోగా పరిచయమైనా..తరువాత చేసినవన్నీ విలన్ పాత్రలే...అయినా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తిరిగి హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఎన్ టి .ఆర్, ఎ.ఎన్ ఆర్ తర్వాత రెండోతరం హీరోలైన కృష్ణ, శోభన్ బాబు తర్వాత తనకంటూ గుర్తుంపును, స్థానాన్ని సంపాదించుకున్న హీరో కృష్ణంరాజు.

    మొదటి సినిమా చిలకా గోరింక తర్వాత నేనంటే నేనే, భలే అబ్బాయిలు, బంగారు తల్లి, మనుషులు మారాలి, మళ్ళీ పెళ్ళి లాంటి సినిమాల్లో విలన్ పాత్రలు, కారెక్టర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసారు... కృష్ణంరాజు అనగానే ప్రేక్షకులు ప్రేక్షకులు గుర్తుపట్టేలా తన నటనతో మెప్పించారు

    ‘జీవన తరంగాలు’ సినిమాతో హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. కృష్ణంరాజు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో కృష్ణంరాజుకు తిరుగులేకుండా పోయింది. 1977లో కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘అమరదీపం’ కృష్ణంరాజు కేరీర్ లో బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, రాష్ట ప్రభుత్వం ఇచ్చే నందిఅవార్డునూ అందుకున్నారు.

    కృష్ణం రాజు నటించిన సినిమాల్లో బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, త్రిశూలం, ధర్మాత్ముడు, కటకటాల రుద్రయ్య, మనవూరిపాండవులులాంటి సినిమాలు బాగా పేరు తీసుకొచ్చిన సినిమాలు. కటకటాల రుద్రయ్య, మనవూరిపాండవులు పదిరోజుల గ్యాప్ లోనే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇలా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న హీరోగా అరుదైన ఫీట్ సాధించాడు. కటకటాల రుద్రయ్య అప్పట్లోనే రూ. 75 లక్షల గ్రాస్ ను వసూల్ చేసి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది.

    సాంఘీక చిత్రాలే కాకుంగా భక్తి రస చిత్రాలు, పౌరాణిక చిత్రాలలో నటించి అభిమానులను, ప్రేక్షకులను తన ఫర్పార్మెన్స్ తో అకట్టుకున్నారు. విశ్వనాథనాయకుడు సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా, కురుక్షేత్రంలో కర్ణుడుగా, శ్రీ వినాయక విజయంలో శివుడుగా, భక్త కన్నప్ప సినిమాలో శివ భక్తుడుగా మెప్పించాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన భక్త కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి కృష్ణంరాజు కెరీర్ లోనే మరో బెస్ట్ మూవీగా నిలిచింది.

    సోలో హీరోగానే కాకుండా కృష్ణంరాజు మల్టీ స్టారర్ చిత్రాలతో కూడా అలరించారు. సూపర్ స్టార్ కృష్ణతో యుద్ధం, రాజ మహల్, శోబాన్ బాబుతో ఇద్దరూ ఇద్దరే, చిరంజీవితో ప్రేమ తరంగాలు, మనవూరి పాండవులు, మోహన్ బాబుతో తిరుగుబాటులాంటి మల్టీ స్టారర్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు.

    గొపీ కృష్ణ మూవీస్ బ్యానర్ లోనే భక్త కన్నప్ప, అమర దీపం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపా రాయుడు లాంటి సూపర్ డూపర్ చిత్రాలు వచ్చాయి..బొబ్బిలి బ్రహ్మన్నలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటే, అమరదీపం సినిమాతో నటుడుగా అవార్డు అందుకున్నారు. మంచి కథ, కథనాలతో వినసొంపైన సంగీతంతో ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండే సినిమాలను అందించిన ఘనత సాధించించి గోపీకృష్ణ బ్యానర్‌కే దక్కుతుంది. ఈయన ఎక్కువ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో చేసిన చిత్రాలు ఈయనకు పేరు తీసుకొచ్చాయి.

    చనిపోయే వరకు  సినిమాల్లో ఎక్కువగా నటించికపోయినా అడపాదడపా కనిపించి అభిమానులకు సంతృప్తి పరుస్తున్నారు.. అలా ఆ మధ్య కాలంలో చేసిన చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రంలో గణపతి దేవుడిగా మరోసారి తన గంభీరమైన నటనతో ప్రేక్షుకుల్ని మెప్పించారు. ఇపుడు తన తమ్ముడు తనయుడు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’లో స్వామిజీ పాత్రలో చివరగా  కనపించారు.

    ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఉత్తమనటుడిగా స్థానం సంపాదించుకున్నారు కృష్ణంరాజు. నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ చేరి ప్రజాసేవలోనూ నిరూపించుకున్నారు. అప్పటి వాజ్‌పేయ్ మంత్రి వర్గంలో పనిచేశారు. కృష్ణంరాజు ఎందరికో మార్గదర్శిగా నిలిచారు

    82 యేళ్లు వయసులో దాదాపు 55 యేళ్లకు పైగా నటుడిగా తన ప్రస్థానం సాగింది.  

    2022 సెప్టెంబర్ 11న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో ఉదయం 3.25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X