twitter
    CelebsbredcrumbLasyabredcrumbBiography

    లాస్య బయోగ్రఫీ

    యాంకర్, టీవీ షో హోస్టుగా పేరొందిన లాస్యా మంజునాథ్ అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.. 2012లో యాంకర్ రవితో కలిసి ‘Something Special’ షోతో పాపులర్ అయింది. ఈ షోతో యువ ప్రేక్షకులలో మరింత ఆదరణ సంపాదించుకున్నారు యాంకర్ లాస్య.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆడియెన్స్‌ను ఆకర్షించింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జన్మించిన లాస్యా హైదరాబాద్‌లోని ప్రముఖ చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ చేసింది. సమ్థింగ్ స్పెషల్ టీవీ షో తరువాత ఆమె 2014లో ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, 2016లో మా ఓరి వంట, 2017లో ‘ఢీ అల్టిమేట్ డాన్స్ షో’ వంటి పలు రకాల టీవీ షోలతో ఆకట్టుకుంది. యాంకర్‌గా ఎన్నో అవార్డులు లభించాయి. 2014లో బెస్ట్ ఫిమేల్ వీడియో జాకీ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

    ఆమె త‌న జీవితంలో రెండుసార్లు పెళ్లి చేసుకుంది. అత‌ను ప్రేమించిన వ్య‌క్తి మంజునాథ్‌తో 2010లో రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకుంది. త‌ర్వాత పెద్ద‌ల‌ను ఒప్పించి 2017లో మ‌రోసారి అంద‌రి స‌మ‌క్షంలో భ‌ర్త‌తో ఏడడుగులు న‌డిచింది.

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో  మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి  ఎంట్రీ ఇచ్చారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X