twitter

    మహేష్ బాబు బయోగ్రఫీ

    మహేష్ బాబు తెలుగు సిని నటుడు అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుసుకుంటారు. మహెష్ ని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడ అంటారు. మహెష్ బాబు 9 aug 1974 సూపర్ స్టార్ కృష్ణ కు  శ్రీమతి ఇందిరా దేవి  గారికి మద్రాసు లొ జర్మించారు.


    సూపర్ స్టార్ కృష్ణ  నటవారసునిగా వెండితెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు జననం మద్రాసు లో జరిగింది. మహేష్ చదువు మద్రాసు లో పూర్తిచేసారు. ప్రాధమిక విద్య సెయింట్ బెడె స్కూల్ లో కొనసాగించగా, లయోలా కాలేజీ నుండి కామర్స్ లో పట్టా పుచ్చుకున్నాడు. చిన్న తనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ 5 సంవత్సరాల వయసులోనే నీడ(1979)చిత్రంతో  తెరంగేట్రం  చేసాడు. బాల్యనటుడిగా తన తండ్రితోపాటు 7 చిత్రాలకు పనిచేసాడు. బాలచంద్రుడు(1991) సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. చిన్న వయసులోనే ముచ్చటైన డైలాగులతో, డాన్సుతో అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ చదువు పూర్తిచేసే ఉద్దేశంతో నటనకు బ్రేక్ వేసాడు. 

    తిరిగి సోలో హీరోగా 1999 లో ప్రిన్స్ మహేష్ బాబు గా రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.  అప్పట్లో అందంగా మిల్క్ బాయ్ లాగా హాలీవుడ్ హీరోలను మరిపించే విదంగా ఉన్న మహేష్ యువతను ఆకర్షించాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో యువరాజు, వంశి చిత్రాలలో నటించినా,  మురారి తో ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2003 లో విడుదల అయిన ఒక్కడు సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నాడు. 

    జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ నాని, అతడు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు  మరింత దగ్గరయ్యాడు. 2006 వచ్చిన ' పోకిరి' ఘనవిజయం సాదించి తెలుగు సినిమా రికార్డులను తిరగరాయటమే కాకుండా, తెలుగు సినిమా మార్కెట్ స్టామినాను ప్రపంచానికి తెలియ చేసింది. అంతకు ముందు వరుకు ప్రిన్స్ అని పిలిపించుకున్న మహేష్ పోకిరి హిట్ తో సూపర్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుత తెలుగు సినిమా అగ్రకధనాయకులలో ఒకడిగా వెలుగొందుతున్న మహేష్ నటనలో తన ఖలేజాను చూపిస్తూ దూకుడు గా తారా పదానికి దూసుకుపోతున్నాడు.

    అవార్డులు:

    నంది అవార్డులు:

    1999 - రాజకుమారుడు - ఉత్తమ నూతన నటుడు 
    2001 - మురారి- స్పెషల్ జ్యూరి 
    2002 - టక్కరి దొంగ -  స్పెషల్ జ్యూరి
    2003 - నిజం - ఉత్తమ నటుడు 
    2004 - అర్జున్ -  స్పెషల్ జ్యూరి
    2005 - అతడు - ఉత్తమనటుడు
    2008  -అథిది - ఉత్తమనటుడు

    ఫిలిం ఫేర్ అవార్డులు:

    2003 - ఒక్కడు -  ఉత్తమ నటుడు
    2006 - పోకిరి -  ఉత్తమ నటుడు
    2008  -అథిది -ఉత్తమ నటుడు
    2011  -దుకుడు-ఉత్తమ నటుడు
    2012  -బిజినెస్ మేన్-ఉత్తమ నటుడు
    2013  - సీతామ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టు-ఉత్తమ నటుడు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X