twitter

    మంచు మనోజ్ కుమార్ బయోగ్రఫీ

    మంచు మనోజ్ కుమార్ తెలుగు సిని నటుడు డా. మోహన్ బాబు కుటుంబం నుండి విష్ణు తరవాత తెలుగు సిని పరిశ్రమకు పరిచయం అయిన మనోజ్ చెన్నైలో జన్మించాడు. ప్రాధమిక విద్య అనంతరం సౌత్ ఈస్ట్రన్ ఓక్లహోమ స్టేట్  యునివర్సిటీ నుండి బి.ఏ లో పట్టభద్రుడయ్యాడు. చిన్ననాటి నుండి సినీవాతావరణంలో పెరిగిన మనోజ్ సహజంగానే సినిమాలమీద ఆసక్తిని పెంచుకున్నాడు. అదే విదంగా తండ్రి నటించిన సినిమాలలో బాల్య నటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. 'మేజర్ చంద్రకాంత్' సినిమాతో వెండి తెరఫై తోలిసారి కనిపించిన మనోజ్ ఆ తరవాత చేసిన 'పుణ్యభూమి నాదేశం' సినిమాకు గాను ప్రశంసలు అందుకున్నాడు. 

    2004 లో 'దొంగ దొంగది'  చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మనోజ్ మంచి కమర్షియల్ విజయాన్ని చూడటానికి 2010 వరుకు ఆగావలసి వచ్చింది. 'దొంగ దొంగది' తో నటనపరంగా మంచి మార్కులు వేయించుకున్న సినిమా ఎవరేజ్ గా నడవటం, ఆ తరవాత వచ్చిన 'శ్రీ', 'రాజు భాయి' పరాజయం పాలవడంతో నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయడం మొదలు పెట్టాడు మనోజ్. ఆ క్రమంలో ప్రయోగాత్మక చిత్రం 'నేను మీకు తెలుసా' చేసి ప్రేక్షకులను ఆకర్షించాడు కానీ సినిమా కధబలం సరిగా లేకపోవడంతో బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేయలేక పోయింది. 

    2009 లో వచ్చిన 'ప్రయాణం' కూడా ఓ మంచి ప్రయత్నం కానీ అది కొద్ది మంది ప్రేక్షకులకు మాత్రమే దగ్గరైంది. 2010 మొదట్లో వచ్చిన 'బిందాస్' ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల మన్ననలు పొంది మనోజ్ కు తోలి హిట్ ను అందించింది. అదే సంవత్సరం వచ్చిన 'వేదం' లో వివేక్ చక్రవర్తిగా నటనలో పరిపక్వతను చూపి అబ్బురపరిచాడు. తరవాత తన అక్క లక్ష్మి తోలిసారి నిర్మించిన ' జుమ్మంది నాదం' చిత్రం పర్వలేదనిపించి మనోజ్ కెరీర్ గ్రాఫ్ ను సమతూకంలో నడిపిస్తుంది. ప్రస్తుతం కరేంట్ తీగ సినిమాతో మంచి విజయం సాధించాడు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X