twitter

    యన్ టి రామారావు

    Born on 28 May 1923 (Age 100) నిమ్మకూరు గ్రామం, క్రిష్ణ జిల్లా, ఆంద�

    యన్ టి రామారావు బయోగ్రఫీ

    పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటునిగా ప్రజా నాయకునిగా కోట్లమంది ప్రజల హృదయాల్లో శాశ్విత స్థానాన్ని సంపాదించుకున్నాడు...అలాగే తన నటన రాజకీయ సామర్థంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలుదిశలా వ్యాపింపజేశాడు. నిమ్మకూరు గ్రామం, క్రిష్ణ జిల్లా, ఆంద్రప్రదేశ్ లో జన్మించారు. బాల్యంలోనే సంస్కృతశ్లోకాలు, పద్యాలూ, పెద్దబాలశిక్ష అవపాసన పట్టి, సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోను, గుంటూరు లోను విద్యాబ్యాసం కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాదమిక శిక్షణ పొందారు... ఆక్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించిన యన్.టి.ఆర్ 'మనదేశం' చలనచిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. అప్పటి నుంచి రాముడిగా, కృష్ణుడిగా మొదలుకుని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధపాత్రలలో జీవిస్తూ 320 చిత్రాలలోనటించి తెలుగు సినిమాకు వన్నె తగ్గని కీర్తిని సంపాయించిపెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కధానాయకుడిగా నిలిచిపోయారు.

    1982 సం.. లో తెలుగు ప్రజల కోరిక మేరకు...మరియు తెలుగువాడి ఆత్మభిమానానికి జరిగిన అవమానాన్ని ప్రతిపాదికగా తీసుకుని సినీరంగం నుండి రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు... పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 సంవత్సరాల జీవన గమనంలోనటుడుగాను, రాజకీయ నాయకుడుగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన శ్రీ రామరావు 1996 జనవరి 18 న గుండెపోటుతో పరమపదించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X