twitter

    నాగ శౌర్య బయోగ్రఫీ

    నాగశౌర్య ముల్పూరి భారతీయ సినిమా నటుడు. నాగ శౌర్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించాడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. అతని మొదటి సినిమా "క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్". జాతీయ బహుమతి పొందిన తెలుగు సినిమా చందమామ కథలులో హాస్య పాత్రను పోషించాడు. తరువాత ఊహలు గుసగుసలాడే మరియు దిక్కులు చూడకు రామయ్య చిత్రాలలో నటించాడు.

    ఆయన మొదటి పాత్రలో నటించే ముందు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు. అవకాశాలు లేక నిరాశతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలనుకున్నాడు. అప్పుడు ఆయన వారాహి చలన చిత్రం ద్వారా ప్రకటనను చూశాడు. ఆయన ఆ తన ప్రొఫైల్ ను పంపించాడు. ఆయనకు ఆశలు లేనప్పటికి ఆయన ప్రముఖ పాత్ర కోసం ఎంపిక అయ్యాడు. ఊహలు గుసగుసలాడే చిత్రంలో పనిచేస్తున్నప్పుడే ఆయన "చందమామ కథలు" చిత్రానికి ఎంపికయ్యాడు. ఆ చిత్రం మొదట విడుదల అయ్యింది.

    ఊహలు గుసగుసలాడే విడుదలైన రెండు మాసాల తరువాత ఆయన కమర్షియల్ విజయాన్ని సాధించాడు. విశ్లేషకులు ఆయన హాస్యసన్నివేశాలకు సరిపోతాడని అన్నారు. వారు తరువాత సినిమాలకు కచ్చితమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఆయన మూడవ చిత్రం దిక్కులు చూడకు రామయ్య కూడా శృంగార హాస్య చిత్రం. "నాగ శౌర్య కొత్త నటులలో ఉత్తమ నటుడిగా నిరూపించుకున్నాడు" అని ఓ పత్రిక వ్యాఖ్యానించింది. ఆ సంవత్సరంలో శౌర్య యొక్క మరొక చిత్రం "లక్ష్మీ రావే మా ఇంటికి". ఆయన తరువాత చిత్రం విడుదలైన "జాదూగాడు". తరువాత "అబ్బాయితో అమ్మాయి" చిత్రంలో నటించాడు.
     నీహారికా కొణిదెలతో కలసి ‎గొట్టిముక్కల వెంకట రామరాజు దర్శకత్వంలో ఒక మనసు చిత్రంలో నటించాడు. తరువాత కళ్యాణ వైభోగమే సినిమాలో నటించాడు.


     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X