twitter
    CelebsbredcrumbNareshbredcrumbBiography

    నరేష్ బయోగ్రఫీ

    నరేష్ ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతను ప్రముఖ నటి విజయ నిర్మల కుమారుడు 1960 జనవరి 20న జన్మించారు.

    బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982 లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

    అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్య చిత్రంగా నిలిచింది. కొద్ది కాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. 


    2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీరాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X