twitter

    రామ్ చరణ్ తేజ బయోగ్రఫీ

    రామ్ చరణ్ తేజ ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడు, నిర్మాతగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు. రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు.


    ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని వివాహమ్ చేసుకున్నాడు. చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత (సినిమా) చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.


    ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది.ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రేండింగ్ లో ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ (సినిమా) చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి ఎవడు (సినిమా) చిత్రంలో నటించాడు. 


    తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ (సినిమా) చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు.2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ లో నటించాడు అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.2016 లో వచ్చిన ధృవ చిత్రం తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు.2018 లో వచ్చిన రంగస్థలం చిత్రం లో చెవిటి వాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు ఆ చిత్రం విజయం తో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది.

    రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘RRR’ సినిమా  ‘రౌద్రం రణం రుధిరం’ హీరోగా రామ్ చరణ్‌కు పుట్టినరోజు మందు రాజమౌళి మంచి కానుక ఇచ్చారనే చెప్పాలి. ఈ సినిమా విడుదలైన తొలిరోజే అన్ని రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. అంతేకాదు తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 235 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచనాలకు వేదికగా నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్‌లతో చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. .

    ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత  రామ్ చరణ్  శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా రామ్ చరణ్‌కు 15వ సినిమా. ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ పరిశీలన ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 14 యేళ్ల కెరీర్‌లో దాదాపు 14 చిత్రాల్లో నటించిన రామ్ చరణ్.. మరో మూడు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.

    శంకర్ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరితో పాటు శ్యామ్ సింగరాయ్ దర్శకులను లైన్‌లో పెట్టారు. ఇక గౌతమ్ తిన్ననూరితో చేయబోయే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X