twitter
    CelebsbredcrumbRavi TejabredcrumbBiography

    రవితేజ బయోగ్రఫీ

    రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు, తల్లి రాజ్యలక్ష్మి. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నటులే.

    మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'నీ కోసం' సినిమాలో రవితేజ హీరోగా చేసాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. 


    పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చి ఇడియట్ సినిమాతో సెటిల్ అయ్యాడు తరువాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్,బలుపు,పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు. రాజా ధి గ్రేట్ తో మరొక విజయాన్ని అందుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X