twitter
    CelebsbredcrumbS.S.Rajamouli
    ఎస్ ఎస్ రాజమౌళి

    ఎస్ ఎస్ రాజమౌళి

    Director/Actor
    Born : 10 Oct 1973
    Birth Place : కొవ్వురు, ఆంద్రప్రదేశ్
    ఎస్. ఎస్. రాజమౌళి 1973 అక్టోబరు 10న జన్మించారు తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.  రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం... ReadMore
    Famous For
    ఎస్. ఎస్. రాజమౌళి 1973 అక్టోబరు 10న జన్మించారు తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. 

    రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత.

    ఇప్పటివరకు 11 సినిమాలు తీసాడు అన్ని సూపర్ హిట్ సాదించాయి అంతేకాకుండా ఆ సినిమాలలో నటించిన హీరోలు అగ్రకథనాయకులు అయ్యిపోయారు. రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరైన సరే సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్...
    Read More
    • ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్- ఆర్ ఆర్ ఆర్
    • దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ - ఆర్ ఆర్ ఆర్
    • నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ - ఆర్ ఆర్ ఆర్
    • ఎత్తర జెండా వీడియో సాంగ్ - ఆర్ ఆర్ ఆర్
    • ఎత్తర జెండా ప్రోమో సాంగ్ - ఆర్ ఆర్ ఆర్
    • రామమ్ రాఘవమ్ సాంగ్ -ఆర్ ఆర్ ఆర్
    • 1
      పేరులో ఉండే యస్.యస్ ను సూపర్ సక్సెస్ గా మలుచుకున్న దర్శకుడు రాజమౌళి....1973 అక్టోబర్ 10 కర్ణాటక రాష్ట్రం రాయచూర్ లో జన్మించాడు. ఆయన అసలు పేరు కోడూరు శ్రీశైల శ్రీ రాజమౌళి. చిన్నప్పటి నుంచి ఇంట్లో సినీ వాతావరణం ఉండటంతో ఆయన అడుగులు ఆటోమెటిక్ గా సినిమా రంగం వైపు మళ్లాయి.
    • 2
      కెరీర్ తొలినాళ్లలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వద్ద పలు సీరియల్స్‌‌తో పాటు సినిమాలకు అసిస్టెంట్ పనిచేసిన రాజమౌళి...ఆయన వద్దే దర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు.
    • 3
      అలా రాఘవేంద్రరావు నిర్మాణ పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన స్టూడెంట్ నెంబర్.1తో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. స్టూడెంట్ నెం.1 తో ప్రారంభమైన రాజమౌళి విజయయాత్ర నేటికీ అప్రతిహతంగా కొనసాగుతునే ఉంది.
    • 4
      స్టూడెంట్ నెం.1 అటు తారక్ కెరీర్ లోను... ఇటు రాజమౌళి కెరీర్ లోను చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాతోనే రాజమౌళి, ఎన్టీఆర్ తమ కెరీర్ లో తొలి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహాద్రి’ ఒక సంచలనమే సృష్టించింది.
    • 5
      సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ తిరుగులేని మాస్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో రాజమౌళి దర్శక ప్రతిభ దాగుంది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. టాప్ హీరోగా ఎదిగేందుకు కృషి చేస్తున్న ఎన్టీఆర్‌కు ఈ సినిమా తిరుగులేని స్టార్ డమ్ ను కట్టబెట్టింది.
    • 6
      సింహాద్రి తర్వాత రాజమౌళి నితిన్ హీరోగా ‘సై’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. అప్పటి వరకు తెలుగు ఆడియన్స్ కు అంతగా పరిచయం లేని రగ్బీ ఆటను.... ఈ సినిమాలో చూపించి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. హాట్రిక్ సక్సెస్ తర్వాత రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. ‘ఛత్రపతి’ సక్సెస్ తో ప్రభాస్ కు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచి అతని ఇమేజ్ అమాంతం పెరిగేలా చేసింది. ఈ క్రెడిట్ దర్శకుడిగా రాజమౌళికే దక్కుతుంది.
    • 7
      రాజమౌళి రూపొందించిన ఐదవ చిత్రం ‘విక్రమార్కుడు’. రవితేజ, అనుష్క జంటగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద జింతాతా అనిపించి...నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అప్పటి వరకు రొటీన్ మాస్ హీరోగా కనిపించిన రవితేజను ఈ సినిమాలో సరికొత్తగా ప్రెజెంట్ చేసి విజయాన్ని అందుకున్నాడు రాజమౌళి. రవితేజ బాడీలాంగ్వేజ్‌కు భిన్నంగా ఆయనలోని సీరియస్ నటున్ని ఆడియన్స్ కు పరిచయం చేసిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది.
    • 8
      తెలుగు తెరపై యముడి ఫార్ములా పై తీసిన సినిమాలు.... బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ కొట్టినట్టే ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు చాలా లావుగా రొటీన్ గా కనిపించే ఎన్టీఆర్‌ను ఈ సినిమాతో సన్నబడేలా చేసాడు. అంతే కాకుండా తారక్‌ను తెరపై సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ సాధించాడు రాజమౌళి.
    • 9
      రాజమౌళి రూపొందించిన ఏడవ చిత్రం ‘మగధీర’. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈజీగా క్రాస్ చేయగలిగింది. ‘మగధీర’ విజయంతో మెగాపవర్ స్టార్‌గా రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరగడంలో ...దర్శకుడిగా రాజమౌళి కృషి ఎంతో దాగి ఉంది.
    • 10
      ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తే ఎలా ఉంటుంది? ‘మగధీర’ సక్సెస్ తర్వాత రాజమౌళి అదే చేశాడు. వరుసగా ఏడు సినిమాల నుంచి తను ఆవిష్కరించిన హీరోయిజాన్నీ....భీకరంగా చూపించే విలనీని వదిలేసి యుద్ధమే చేశాడు. అస్త్రాలేమి చేతబూనకుండా వినోదంతోనే విజయం సాధించాడు. కథను నమ్ముకుంటే ఫలితం ఎలా ఉంటుందో ‘మర్యాద రామన్న’ సినిమాతో నిరూపించాడు.అప్పటివరకు కేవలం కామెడీ నటుడుగా ఉన్న సునీల్‌తో ‘మర్యాద రామన్న’ అనే హిట్టును అందుకున్నాడు.
    • 11
      రాజమౌళి శైలికి భిన్నంగా తీసిన ఈ సినిమా కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో తాను పెద్ద హీరోలతోనే కాదు కమెడియన్లతో కూడా హిట్ కొట్టగలనని నిరూపించుకున్నాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన చాలా చిత్రాలు వివిధ భాషల్లో రీమేక్ కావడం విశేషం.
    • 12
      ‘మర్యాద రామన్న’ రాజమౌళి తీసిన ఈగ పెద్ద సెన్సెషనే క్రియేట్ చేసింది. చిన్న ఆకారం, శక్తి, సామర్థ్యాలు తక్కువ. ఏం చేస్తుందిలే ఈగ అవి ఆషామాషీగా తీసుకుంటాం. అలాంటి అల్పజీవి ఈగనే హీరోగా చేసి...సక్సెస్ కొట్టడం ఒక్క రాజమౌళికే చెల్లింది. గ్రాఫిక్స్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా హోల్ ఇండియా తనవైపు చూసేలా చేసాడు రాజమౌళి.
    • 13
      తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న కూడా అతడే. మాస్ పల్స్ తెలిసిన దర్శక ఛత్రపతి. హీరోయిజాన్ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసి కథానాయికుడు ఇమేజ్ ను పెంచే దర్శకధీరుడు రాజమౌళి
    • 14
      స్టోరీ ఎలాంటిదైనా తన టాలెంట్ తో మెస్మరైజ్ చేసే గ్రేట్ టెక్నీషియన్. తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి. హీరోలతో సమానమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రేజీ డైరెక్టర్. ఆయనే దర్శకమౌళి...రాజమౌళి.
    • 15
      సినిమా అంటే కేవలం హీరో, కథ మాత్రమే కాదు.. క్రియేటివిటీ అని చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి అంటే పేరు కాదు... ఇట్సే బ్రాండ్....అందుకే రాజమౌళి అనే పేరు మీదే బిజినెస్ జరిగేంతగా పాపులర్ అయ్యాడు.
    • 16
      ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘RRR’ అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చాలా యేళ్ల తర్వాత తెలుగు తెరపై తెరకెక్కుతున్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే. చరిత్రలో అసలు కలవని కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నడు. ఈ సినిమా 2020 జూలై 30న రిలీజ్ కానుంది.
    • 17
      మొత్తానికి వెండితెరపై హీరోయిజాన్ని కాకుండా డైరెక్టరిజాన్ని చూపిస్తున్నాడు. తెలుగు సినిమా స్థాయిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన రాజమౌళికి కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
    ఎస్ ఎస్ రాజమౌళి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X