twitter

    సమంత రుతు ప్రభు బయోగ్రఫీ

    సమంత రుతు ప్రభు 28 ఏప్రిల్, 1987 చెన్నైలొ జన్మించింది. తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె పూర్తి పేరు సమంత రుతు ప్రభు. తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో  తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగు ప్రముఖ కథానాయికగా ఎదిగింది.


    రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది. ఏ మాయ చేశావే సినిమాకిగాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు మరియు  ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డ్ వరించాయి. బృందావనం, జబర్‌దస్త్, రామయ్యా వస్తావయ్యా, మనం, రభస, మహానటి, యూ టర్న్ వంటి చిత్రాలలో నటించింది. అక్కినేని నాగార్జున కోడలిగా, నాగచైతన్య భార్యగా కూడ సినిమాలలొ నటించింది. 2017లొ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళితర్వాత కూడ సినిమాలలొ నంటించిన నటీమణులు చాలా అరుదు అందులొ ఒకరు సమంత.
     
    అక్టోబర్‌ 2017, 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని నాగ చైతన్య  ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఎవరి జీవితాన్ని వారు వేర్వేరుగా జీవించేందుకు సిద్దపడ్డారు. భార్యభర్తలుగా విడిపోయినా కూడా స్నేహితుల్లా కలిసి ఉంటామని, తమ బంధం అలానే కొనసాగుతామని అన్నారు. విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కూడా ఒకే రకమైన ప్రెస్ నోట్‌ను వదిలారు. 


     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X