twitter

    సిమ్రన్ బగ్గా బయోగ్రఫీ

    సిమ్రాన్ (జననం ఏప్రిల్ 4, 1976) ఈమె తండ్రి అశోక్ నావల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమె ముంబైలో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది
    దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మలయాళంలో "ఇంద్రప్రస్థం". 1997 లో ‘అబ్బాయి గారి పెళ్లి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్. సిమ్రాన్ అసలు పేరు రిషీబాల నావల్. అంతకు ముందే సావన్ కుమార్ హిందీ చిత్రం  ‘సనమ్ హర్జాయి’ లో హీరోయిన్ గా తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో ఆమె తన పేరును ‘సిమ్రాన్’ గా మార్చుకుంది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. 

    మలయాళ, తమిళ్ లో అగ్రహీరోయిన్ గా కొనసాగుతునే తెలుగులోను నటించింది. తెలుగులో తమిళ డబ్బింగ్ ‘వాలి’ సినిమాలో సిమ్రాన్ నటన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యేలా చేసింది. ఆ తరువాత తెలుగులో నేరుగా చేసిన ప్రియ ఓ ప్రియా, మా నాన్నకు పెళ్లి... చిత్రాలా సక్సెస్ తో తెలుగులోను అవకాశాలు వెల్లువెత్తాయి..

    1998లో మెగాస్టార్ హీరోగా వచ్చిన అన్నయ్య మూవీలో ఆటకావాలా పాటకావాలా అంటూ సిమ్రాన్ చేసిన ఐటెమ్ సాంగ్ ఆమె కెరీర్ కు మంచి ఊపు ఇచ్చింది. ఆ తరువాత  డాడీ, మృగరాజు సినిమాల్లో చిరుకు జోడిగా నటించి మెప్పించింది సిమ్రాన్.

    1999లో వచ్చిన సమరసింహా రెడ్డి లో బాలకృష్ణతో జత కట్టిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.... ఈ మూవీతో టాలీవుడ్ టాప్ ఛైర్ కైవసం చేసుకొంది సిమ్రాన్. ఆ తరువాత వీరద్దరు కలిసి నటించిన నరసింహనాయుడు, సీమసింహం మంచి హిట్ సాధించాయి. 


    2000లో వెంకటేష్ తో సిమ్రాన్ నటించిన కలిసుందాం....రా! కూడా హిట్ సాధించింది. ఈ మూవీలో గడసరి పిల్లగా సిమ్రాన్ నటన ప్రేక్షకలను ఆకట్టుకునేలా చేసింది. ఆ తరువాత వెంకీతో చేసిన ప్రేమతో …రా! పరాజయం పాలైనా ఆఫర్లు తగ్గలేదు.

    కింగ్ నాగార్జునా తో చేసిన నువ్వువస్తావని చిత్రం ఆమెలోని నటిని ఆవిష్కరించింది. ఈ మూవీలో అంధురాలిగా ఆమె అభినయం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 


    సీనియర్ హీరోలతోనే కాకుండా అప్ కమింగ్ హీరోలతో నటించి మెప్పించింది సిమ్రాన్. సూపర్ స్టార్ మహేశ్ తో చేసిన యువరాజు లో ఆమె భార్య గా చక్కగా మురిపించింది. ఆ తరువాత హరికృష్ణ, వైవియస్.చౌదరి కలయికలో వచ్చిన సీతయ్యలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో ఒక్కమగాడు అంటూ సిమ్రాన్ వేసిన స్టెప్పులు ప్రేక్షకుల చేత అదరహో అనిపించేలా చేసింది సిమ్రాన్. 

    ఎన్నో దక్షిణాది చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా నటించి మెప్పించిన సిమ్రాన్..... 2003లో దీపక్ బగ్గా ను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నా నటనకు దూరం కాలేదు సిమ్రాన్. ఆ తరువాత ఒక్కమగాడు, జాన్ అప్పారావు 40+ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం టోటల్ గా తన సమయాన్ని ఫ్యామిలీ లైఫ్ కే కేటాయిస్తుంది. .

    సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో తుప్పారివాలన్, పేట వంటి చిత్రాల్లో నటించింది. దాంతో పాటు ఇపుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. మరోవైపు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటించింది
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X