twitter
    CelebsbredcrumbSrikanthbredcrumbBiography

    శ్రీకాంత్ బయోగ్రఫీ

    మేక శ్రీకాంత్ తెలుగు సిని నటుడు అభిమానులందరు శ్రీకాంత్ అని పిలుసుకుంటారు. శ్రీకాంత్ 23 mar 1968 విజయవాడ లో జన్మించారు. పుట్టింది విజయవాడలో పెరిగారు, చదువుకుంది కర్ణాటకలో. కర్నాటకలోని గంగావతి ప్రాంతంలో స్థిరపడిన చిన్న రైతు కుటుంబం శ్రీకాంత్ వాళ్ళది. ఏడో తరగతి వరుకు అందరి పిల్లల్లాగా బుద్దిమంతుడిగా పెరిగిన శ్రీకాంత్  ఆ తరవాత సినిమాల మీద వ్యామోహం పెంచుకుని విపరీతంగా సినిమాలు చూడటం మొదలు పెట్టాడు. అది ఎంతలా అంటే పదవ తరగతి పూర్తవ్వగానే ఎట్టిపరిస్తితుల్లో సినిమాల్లో నటించాలి అనే బలమైన కోరికతో ఫై చదువులకని డబ్బు తీసుకుని మద్రాస్ వెళ్ళిపోయాడు.

     కానీ అక్కడి పరిస్థితులను అర్ధం చేసుకోవటంలో భాదలు పడ్డ శ్రీకాంత్  తిరిగి ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకుని కంగారు పడ్డ కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇష్టాన్ని ఒప్పుకున్నారు కానీ డిగ్రీ పూర్తి చేసి ప్రయత్నించమన్నారు. దాంతో దర్వాడ్ యూనివెర్సిటీ లో బి.కామ్ పూర్తి చేసాడు. ఆ తరవాత మద్రాస్ లోని అడయార్ ఫిలిం ఇనిస్టిట్యుట్ లో సీటు దొరక్కపోయేప్పటికి హైదరాబాద్ వచ్చి మధు ఫిలిం ఇనిస్టిట్యుట్ లో జాయిన్ అయ్యాడు. శిక్షణ పూర్తయిన తరవాత ఆవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఉషాకిరణ్ మూవీ నిర్మిస్తున్న చిత్రంలో 15 మంది కొత్త వాళ్ళు కావాలని అని తెలిసి వెళ్తే దర్శకుడు మోహన్ గాంధీ శ్రీకాంత్ ను ఎంపిక చేసాడు.  ఆ విదంగా 'పీపుల్స్ ఎన్ కౌంటర్ '(1991)  సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. వెంటనే 'మధురానగరిలో' లో  హీరోగా ఆవకాశం రావటంతో ఆ తరవాత కూడా హీరో అవకాశాలువస్తాయేమో అని ఎదురు చూసాడు కాని లాభం లేక పోయింది. అదే సమయంలో ఇ.వి.వి. సత్యనారాయణ విలన్ గా నటించమని కోరడంతో 'వారసుడు' సినిమాలో నటించాడు. ఆ తరవాత దాదాపు 13 సినిమాలలో విలన్ గా నటించాడు.

    అలా కాలం గడిచిపోతున్నసమయంలో తమ్మారెడ్డి భరద్వాజ 'ఒన్  బై టూ' (1993)చిత్రంలో హీరోగా ఆవకాశం ఇచ్చారు. తరవాత ఆయనే 'దొంగ రాస్కెల్' రూపొందించాడు. అవి ఆశించినంత ఫలితం రాబట్టలేక పోయిన శ్రీకాంత్ కు నటుడిగా గుర్తింపునిచ్చాయి. అలా శ్రీకాంత్ ఫై విశ్వాసం ఉంచిన ఇ.వి.వి 'ఆమె '(1994) చిత్రం లో మంచి పాత్ర ఇచ్చారు. సినిమా విజయవంతం అయ్యి శ్రీకాంత్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. శ్రీకాంత్ లోని ప్రతిభ గుర్తించిన రామానాయుడు గారు శ్రీకాంత్ సోలో హీరోగా 'తాజ్ మహల్ '(1995) నిర్మించారు. ఆ సినిమా హిట్ అవటంతో శ్రీకాంత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజ్ మహల్ విజయంతో రాఘవేంద్ర రావు దృష్టిలో పడ్డ శ్రీకాంత్ కు 'పెళ్ళిసందడి'(1996) లో ఆవకాశం వచ్చింది. ఆ సినిమా ఘనవిజయం సాదించడం తో హీరోగా స్థిరపడ్డాడు. ఇక అక్కడి నుండి వరసగా సినిమాలు చేసుకుంటూ 100 చిత్రాలు పూర్తిచేసాడు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X