సుమంత్
Born on 09 Feb 1975 (Age 48)
సుమంత్ బయోగ్రఫీ
సుమంత్ గా ప్రసిద్ధిచెందిన సుమంత్ కుమార్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత. 1975 ఫిబ్రవరి 9 న హైదరాబాదులో జన్మించాడు. సుమంత్ తల్లి నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె. తండ్రి యార్లగడ్డ సురేంద్ర. సుమంత్ ఈ దంపతులకు ఒకడే సంతానం. అక్కినేని మనవలు, మనవరాళ్ళలో సుమంతే అందరికన్నా పెద్దవాడు.
సుమంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన తర్వాత అమెరికా వెళ్ళి మిషిగన్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. చికాగో లో కొలంబియా కాలేజీ లో ఫిల్మ్ కోర్సులో చేరి డిగ్రీ సంపాదించాడు.
సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. అతని రెండవ చిత్రం, యువకుడు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇతను తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003 లో జెనీలియా తో నటించిన సత్యం తో హిట్ అందుకున్నారు. గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. 2006 సంవత్సరం లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. చిన్నోడు అంతగా హిట్ కాలేదు. మధుమాసం, పౌరుడు బాక్సాఫీస్ లో బాగానే ఆడి, కొన్ని సెంటర్స్ లో 100 రోజులు కూడా నడిచాయి.
2009 లో వచ్చిన బోణి ప్లాప్ అయ్యింది. 2011 లో గోల్కొండ హై స్కూల్ హిట్ ఐయ్యి సుమంత్ కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని వరస విఫలాలు తర్వాత 2017 లో మళ్ళీ రావా అతని కెరీర్ కి మళ్ళీ ఊపిరి ఇచ్చింది. ఎన్.టీ.ఆర్:కథానాయకుడు లో అతని తాత అక్కినేని పాత్ర పోషించి పలు ప్రశంసలు పొందాడు.
సుమంత్ 2004 సంవత్సరంలో కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని, 2006 లో విడాకులు తీసుకున్నాడు.
సంబంధిత వార్తలు