twitter
    CelebsbredcrumbSushanthbredcrumbBiography

    సుశాంత్ బయోగ్రఫీ

    సుశాంత్ అనుమోలు సత్య భూషణరావు మరియు అక్కినేని నాగసుశీలలకు జన్మించాడు. హైదరాబాదులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలు లో విద్యాభ్యాసం చేసాడు. ఇంటర్మీడియట్ విద్యను గౌతమి జూనియర్ కళాశాలలో పూర్తిచేసాడు. ఆయన ఉర్బానా-చాంపైన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో బి.ఎస్. పూర్తిచేసాడు. ఆయన యునైటెడ్ టెక్నాలజీస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా నటునిగా ప్రవేశించక ముందు ఉద్యోగం చేసాడు. ఆయన తన కజిన్ అయిన నాగచైతన్యతో పాటుగా ముంబై లోని క్రియేటింగ్ కారెక్టర్స్ ట్రైనింగ్ స్కూలులో నటనపై శిక్షణ పొందాడు.

    సుశాంత్ 2008 లో కాళిదాసు చిత్రం ద్వారా చిత్రరంగంలోకి అడుగు పెట్టాడు. ఈ చిత్రం శ్రీనివాస్ చింతలపూడి మరియు నాగసుశీల చే శ్రీనాగ్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మించబడినది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టుడియోస్ సమర్పించింది. ఈ చిత్రంలో సుశాంత్ తమన్నాతో జంటగా నటించాడు. ఈ చిత్రానికి జి.రవిచరణ్‌రెడ్డి దర్శకత్వం వహించాడు.

    తరువాతి చిత్రం పేమకథతో కూడిన కరెంట్ 2009 లో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తే స్నేహా ఉల్లాల్ కథానాయకిగా నటించారు. ఈ రెండు చిత్రాలలో సుశాంత్ నాట్య మరియు ఫైటింగ్ నైపుణ్యాలలో అభినందించబడ్డాడు.

    సుశాంత్ మూడవ సినిమా అడ్డా వినోదాత్మక చిత్రం. ఈ చిత్రాన్ని జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తే అనోప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఆయనకు సహ నటిగా లవ్‌లీ చిత్రంతో రంగప్రవేశం చేసిన నటి శాన్వీ శ్రీవాస్తవ నటించింది. 

    ‘చి.ల.సౌ’తో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న సుశాంత్ ,  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల...వైకుంఠపురుములో’ చిత్రంలో కీలక పాత్రలో నటించి అందిరి మన్నలను పొందాడు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X