twitter

    విజయశాంతి బయోగ్రఫీ

    విజయశాంతి  జూన్ 24, 1966న వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగింది. విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే సినీరంగం మొదలైంది. 

    విజయశాంతి తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది.  ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్" మరియు "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.


    తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్‌గా పిలుపించుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తరవాత సినిమాలకు దూరమైపోయారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమాలో ఆమె చివరిగా కనిపించారు. ఆ తరవాత మరే సినిమాను ఆమె అంగీకరించలేదు. అయితే, 13 ఏళ్ల విరామం తరవాత విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకోబోతున్నారు. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X