» 

చిరంజీవి క్లాసిక్ రీమేక్ చేయాలని అమీర్ ఖాన్?

Posted by:
 

హైదరాబాద్ : ప్రస్తుతం హిందీ హీరోల దృష్టి మొత్తం సౌత్ సినిమలపై ఉంది. ఎప్పడప్పటి పాత సినిమాలను కూడా తవ్వి తీసి వాటి రీమేక్ చేయాలని తిరుగుతున్నారు. తాజాగా అమీర్ ఖాన్ ఇలాంటి ప్రపోజల్ ఒకటి అల్లు అరవింద్ కు పెట్టినట్లు సమాచారం. చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ గా మిగిలిన రుద్రవీణ చిత్రాన్ని ఆయన రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. బాలచందర్ డైరక్ట్ చేసిన ఆ చిత్రాన్ని ఇప్పటి కాల,మాన పరిస్ధితులకు అణుగుణంగా మార్చి హిట్ కొట్టాలని అమీర్ ఖాన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. తన తాజా చిత్రం ధూమ్ 3 రిలీజ్ అనంతరం రుద్రవీణ కు చెందిన మిగతా విషయాలు రివిల్ కావచ్చు.

అమీర్‌ఖాన్‌ ప్రతినాయకుడిగా నటించిన చిత్రం 'ధూమ్‌-3'. అభిషేక్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, ఉదయ్‌చోప్రా ప్రధాన పాత్రలు పోషించారు. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ధూమ్‌-3 చిత్ర బృందం హైదరాబాద్‌లో సందడి చేసింది. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమీర్‌ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, హీరోయిన్‌ కత్రినాకైఫ్‌లు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.

Aamir Khan to remake Rudraveena?

అమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ... 'ధూమ్‌3' వ్యక్తిగతంగా, వృత్తిపరంగానూ నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. 'ధూమ్‌' సినిమాల్లో అభిషేక్‌, ఉదయ్‌చోప్రాల పాత్రలంటే నాకు చాలా ఇష్టం. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో నాది ప్రతినాయకుని పాత్ర కాదు. ఆ ఛాయలున్న నాయకుని పాత్ర. ఈ సినిమా కోసం శారీరకంగానే కాకుండా, మానసికంగానూ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. పోరాట సన్నివేశాల్లో 80 శాతం డూప్‌ లేకుండా చేశాను. సర్కస్‌ ఫీట్లు, ట్యాప్‌ డ్యాన్స్‌ లాంటివాటిని నేర్చుకున్నాను. చాలా దేశాల సర్కస్‌ కార్యక్రమాల్ని చూశాను. నిపుణుల దగ్గర శిక్షణ తీసుకున్నాం. టాప్‌ సర్కస్‌ సంస్థల్లో పనిచేసేవాళ్లు ఈ సినిమాలో నటించారు.

నేను చేసే ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉండేలా చూసుకుంటాను. అలా అయితేనే ఆనందిస్తూ చేయగలం. నేను కలిసి నటించిన వాళ్లలో అమితాబ్‌బచ్చన్‌, కత్రినాకైఫ్‌లను ఎప్పటికీ మరచిపోలేను. వాళ్ల అంకిత భావం గొప్పది. నేను హైదరాబాద్‌లో ప్రచారం చేయడం మొదటిసారి. నా వరకు నెంబరింగ్‌ గేమ్‌, వసూళ్ల మీద నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. నేను చేసిన సినిమా విజయం సాధించిందా లేదా అనేదే నాకు ముఖ్యం. మరోవైపు సత్యమేవ జయతే2 కార్యక్రమం కోసం రంగం సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభిస్తాం.

Read more about: ameerkhan, chiranjeevi, rudraveena, అమీర్ ఖాన్, చిరంజీవి, రుద్రవీణ
English summary
Aamir Khan is interested in the remake of K Balachander’s iconic film Rudraveena. This film starred Chiranjeevi. K Balachander who is excited with this development encouraged Aamir to take up this storyline and tailor it to the current scenario. Although then the film flopped, Rudraveena is falls in the league of classics of Tollywood.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos