twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి: ది బిగినింగ్' కు రెండు ఇంటర్వెల్ లు

    By Srikanya
    |

    హైదరాబాద్: తొలి చిత్రం నుంచి రాజమౌళి తన చిత్రాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ట్విస్ట్,గ్రాఫిక్స్, డైలాగులు, ఎమోషన్,యాక్షన్ ఇలా అన్ని కలగలపి ఆయన ఇంటర్వెల్ క్రియేట్ చేస్తూంటారు. అసలు ఆయన చిత్రాలు ఇంటర్వెల్ మొదట అనుకుని తర్వాత మిగతా కథ డిజైన్ చేస్తారా అన్నట్లు ఉంటాయి. ఈ నేపధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలిలో ఇంటర్వెల్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తకరమైన చర్చగా మారింది. అయితే ఈ సినిమాలో రెండు ఇంటర్వెల్ లు ఉంటాయి అంటున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అంటే రెగ్యులర్ గా వచ్చే ఇంటర్వెల్ ఒకటి...ప్రీ క్లైమాక్స్ సైతం ఇంటర్వెల్ స్దాయిలో కథను మలుపు తిప్పేలా డిజైన్ చేసారని, అక్కడ ఓ ట్విస్ట్ వస్తుందని, అలాగే...యాక్షన్ తో ప్రేక్షకుడు షాక్ కు గురి అవుతాడని అంటున్నారు. ఆ స్ధాయిలో రాజమౌళి ఈ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లను డిజైన్ చేసాడని చెప్పుకుంటున్నారు.

    ఇక 'బాహుబలి' చిత్రం పూర్వ నిర్మాణ దశ నుంచే ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. రూ.200 కోట్ల పైచిలుకు భారీ వ్యయంతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఈ సినిమా తొలి భాగాన్ని 'బాహుబలి - ది బిగినింగ్‌'గా వ్యవహరిస్తున్నారు.

     About Interval Bangs In 'Baahubali: The Beginning'

    ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.'బాహుబలి' హిందీ వెర్షన్‌ సమర్పకుల్లో ఒకరైన కరణ్‌ జోహార్‌ కూడా ఈ పోస్టరుపై స్పందించారు. ''రాజమౌళి శ్రమకు రూపమైన 'బాహుబలి'కి సమర్పకునిగా వ్యవహరిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని జులై 10న విడుదల చేస్తున్నాం'' అంటూ ట్వీట్‌ చేశారు.

    కరణ్‌ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌, అనిత్‌ తడానీకి చెందిన ఎ.ఎ. ఫిల్మ్స్‌ ఈ సినిమా హిందీ వెర్షన్‌ను సమర్పిస్తున్నాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో హిందీ 'బాహుబలి'ని విడుదల చేస్తారు. తమిళంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.

    మే1 నుంచి ఒక్కో ప్రధాన పాత్రకు సంబంధించి ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. దీని సంబంధించి రాజమౌళి ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ''సినిమాని మే 15న విడుదల చేస్తున్నామని ఇది వరకు నేనే చెప్పా. అయితే నిర్మాణానంతర పనులు పూర్తి కాకపోవడంతో అది కుదరలేదు. ట్రైలర్‌ను పక్కాగా మే 31న విడుదల చేస్తాం'' అని ఆ వీడియోలో చెప్పారు రాజమౌళి.

    విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న ఈ చిత్రం కోసం రాజమౌళి బృందం రేయింబవళ్లు కష్టపడుతోంది. 17 వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల్లో 600 మంది సాంకేతిక నిపుణులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారనీ, అయినా అనుకొన్న సమయానికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయామని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు రాజమౌళి.

    అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ముఖ్యభూమిక పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో విడుదల కానుంది. ప్రభాస్‌ కూడా ఫేస్‌బుక్‌ ద్వారా 31న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

    English summary
    The pre climax of Baahubali film will also look like another interval bang, holding the excitement of audiences and creating a suspense.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X