twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి, ఎన్టీఆర్ సేమ్ టు సేమ్

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్ ని దగ్గర నుంచి చూసిన వారు వర్కో హాలిక్ అంటూంటారు. షూటింగ్ పెట్టుకున్నాడంటే ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టడు. ఎంత స్పీడుగా దాన్ని ఫినిష్ చేద్దామనే ఆలోచనలోనే ఉంటాడు. పూరి కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఇద్దరూ కలిసారు. దాంతో సంక్రాంతి పండుగ కోసం రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ రాత్రింబవళ్లూ జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని సైతం త్వరలోనే అంటే దీపావళి కి విడుదల చేసేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు రిలీజ్ చేస్తే ఇక ఛానెల్స్ అన్నీ దీన్నే మార్చి మార్చి వదులుతాయనటంలో సందేహం లేదు.

    ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 25% కంప్లీట్ అయ్యింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. 2015 సంక్రాంతికి సినిమాను ఎట్టి పరిస్థితితులలోనైన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ఎన్టీఆర్, పూరి ఆయన టీం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

    About NTR’s new film shooting

    యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    కెనిడయన్ మోడల్ అయిన నోరా ఫటేహి ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    NTR and director Puri Jagan’s film shoot is going on at a brisk pace in the outskirts of Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X