Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మారుతి పుణ్యమే...రేటు పెంచేసాడు
హైదరాబాద్: మొదటి నుంచీ కమిడియన్ సప్తగిరిని ప్రోత్సహిస్తూ వస్తోంది దర్శక,నిర్మాత మారుతినే. తాజాగా ఆయన కథ,మాటలు, స్క్రీన్ ప్లే అందించిన లవర్స్ చిత్రంలోనూ సప్తగిరికి అదిరిపోయే క్యారెక్టర్ ఇచ్చి నిలబెట్టాడు. ఆ సినిమా క్రెడిట్ మొత్తం ఇప్పుడు సప్తగిరికే వెళ్లింది. దాంతో సప్తగిరి ఒక్కసారి తన రేటుని పెంచేసాడని టాక్. ఇన్నాళ్లూ దాదాపు యాభై వేల నుంచి డబ్బై వేలు దాకా రోజుకు తీసుకునే సప్తగిరి..రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకూ డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరో ప్రక్క సప్తగిరిని హీరోగా పెట్టి సినిమా తీసే ఆలోచనలో మారుతి ఉన్నట్లు సమాచారం.
సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటించిన చిత్రం లవర్స్. హరి దర్శకుడు. మాయాబజార్ మూవీప్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు నిర్మించారు. ఈ నెల 15న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం మార్నింగ్ షోకే మంచి టాక్ తెచ్చుకుని, కలెక్షన్స్ పరంగానూ నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టే దిసగా దూసుకుపోతోంది.
సప్తగిరి పండించే హాస్యం కడుపుబ్బా నవ్వించటమే ప్లస్ అయ్యింది. నవతరం ప్రేమికుల మనోభావాలకు అందమైన దృశ్యరూపంలా ఈ చిత్రం వుంటుందని చెప్పినా కేవలం సప్తగిరి కామెడీ కోసమే జనం థియోటర్స్ కు వెళ్టటం జరుగుతోంది. చిన్న తెర బ్రహ్మానందంగా సప్తగిరి ఈ చిత్రంతో వెలిసారు.
ఎం.ఎస్.నారాయణ, సప్తగిరి, సాయి, షామిలి, తేజస్విని, ఆహుతిప్రసాద్, సన, అనితాచౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: జేబి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకటసతీష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: మారుతి.