twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న జిలేబి..నిన్న డింపుల్..ఇప్పుడు సిప్పీ

    By Srikanya
    |

    హైదరాబాద్ : బ్రహ్మానదం లేని తెలుగు పెద్ద సినిమా ఊహించలేని స్ధితికి వచ్చింది. ముఖ్యంగా కామెడీలు రాజ్యం ఏలుతున్న ఈ సమయంలో బ్రహ్మానందం రకరకాల గెటప్ లలో, పేర్లతో స్క్రీన్ పై నవ్వులు కురిపిస్తూ భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిస్తున్నాడు. మొన్నామధ్య నాయక్ చిత్రంలో జిలేబిగా కనిపించి, తర్వాత కిల్ బిల్ పాండేగా రేసుగుర్రంలోనూ... రీసెంట్ గా అల్లుడు శ్రీను చిత్రంలో డింపుల్ గా కనిపించిన బ్రహ్మానందం ఇప్పుడు సిప్పీగా మరోసారి నవ్వించటానికి సిద్దమవుతున్నాడు. ఈ సారి గోపీచంద్ చిత్రం 'లౌక్యం' లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉండనుంది.

    గోపీచంద్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'లౌక్యం'. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మాత. టాకీ భాగం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గోపీచంద్‌, హంసానందినిపై ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. 'గల్లీ కుర్రాళ్లే... చూడ్డానికొచ్చారే...' అంటూ సాగే ఆ గీతాన్ని చంద్రబోస్‌ రచించారు. శంకర్‌ మాస్టర్‌ నృత్య రీతులు సమకూరుస్తున్నారు.

    After Dimple, Brahmi appears as Sippy!

    గోపీచంద్‌ మాట్లాడుతూ ''నవ్వించడమే లక్ష్యంగా చేస్తున్న సినిమా ఇది. దర్శకుడు శ్రీవాస్‌, రచయిత శ్రీధర్‌ సీపాన కలిసి నాతో ఓ కొత్త రకమైన పాత్ర చేయిస్తున్నారు. నా ప్రయాణంలో వినోదాత్మక చిత్రాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ తరహాలో మరో చిత్రం తెరకెక్కుతుండడం ఆనందంగా ఉంది. ఇందులోని ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. నేను, బ్రహ్మానందం, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కలిసి కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. త్వరలో యూరప్‌లో మూడు పాటల్ని చిత్రీకరించబోతున్నాం'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''శ్రీధర్‌ సీపాన నాకు కథ చెప్పినప్పుడు చాలా నవ్వొచ్చింది. ఇంత సరదా కథలుంటాయా అనిపించింది. దర్శకుడిగా ఇదివరకు నేనూ సీరియస్‌ సినిమాలే చేశా. ఇది మాత్రం నన్ను కొత్తదారిలోకి తీసుకెళుతుంది. హంసానందిని కీలకమైన పాటతోపాటు ఓ కీలకమైన పాత్ర కూడా చేసింది'' అన్నారు.

    English summary
    Brahmnandam will be seen as 'Sippy' in Gopichand's upcoming flick 'Loukyam'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X